యాప్నగరం

చంకలో కోడిపుంజుతో చిట్టిబాబు రిపబ్లిక్ డే విషెష్

నా పేరు సిట్టిబాబండీ.. అంటూ గత రెండు రోజులుగా ‘రంగస్థలం’ టీజర్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరో ఇంట్రస్టింగ్ పోస్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు

TNN 26 Jan 2018, 6:31 pm
నా పేరు సిట్టిబాబండీ.. అంటూ గత రెండు రోజులుగా ‘రంగస్థలం’ టీజర్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరో ఇంట్రస్టింగ్ పోస్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేస్తూ.. ‘రంగస్థలం’ మూవీ నుండి మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
Samayam Telugu republic day wishes from rangasthalam 1985 movie team
చంకలో కోడిపుంజుతో చిట్టిబాబు రిపబ్లిక్ డే విషెష్


ఈ పోస్టర్‌లో చిట్టిబాబు చంకలో కోడిపుంజును పెట్టుకుని.. పాత కాలం నాటి లాంతర్‌లో ఉన్న దేశ జెండాకు సలాం చేస్తున్నట్లు ఉన్న పోస్టర్ మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. మైత్రి మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. రామ్ చరణ్ సరసన సమంత నటిస్తుంది. జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం మార్చి 30న విడుదల కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.