యాప్నగరం

సన్నీ ఫ్యాన్స్ నిజాయితీకి వర్మ సెల్యూట్!

ఒక మొబైల్ షోరూం ను ప్రారంభించడానికి కొచ్చికి వెళ్లిన సన్నీ లియోన్ ను చూడటానికి స్థానికులు చుట్టుముట్టిన వైనం

TNN 19 Aug 2017, 2:57 pm
ఒక మొబైల్ షోరూం ను ప్రారంభించడానికి కొచ్చికి వెళ్లిన సన్నీ లియోన్ ను చూడటానికి స్థానికులు చుట్టుముట్టిన వైనం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. సన్నీలియోన్ రావడంతో షోరూం పరసరాలు అన్నీ జనమయం అయ్యాయి. రోడ్లపై జనాలు చుట్టుముట్టారు. కిలోమీటర్ల దూరం జనమయం అయ్యింది. ఇసకేస్తే రాలని స్థాయిలో జనాలొచ్చారు. ఏ రాజకీయ పార్టీ మీటింగ్ కు రానంత స్థాయిలో, డబ్బులిచ్చి రప్పించినా రానంత స్థాయిలో సన్నీని చూడటానికి జనాలు వచ్చారు.
Samayam Telugu rgv facebook post on sunny fan following
సన్నీ ఫ్యాన్స్ నిజాయితీకి వర్మ సెల్యూట్!


అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తనదైన శైలిలో స్పందించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ పట్ల వర్మ ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టాడు.

‘సన్నీ లియోన్ కోసం వచ్చిన జనసందోహాన్ని చూసి మలయాళ సూపర్ స్టార్లు మోహన్ లాల్, మమ్ముట్టీలు అసూయతో ఏడుస్తారు. ఎందుకంటే.. వారికోసం కూడా ఎప్పుడూ జనాలు ఆ స్థాయిలో వచ్చి ఉండరు. సన్నీలియోన్ పై అభిమానం చూపడంలో, ఆమెను చూడాలని తపించడంలో అసాధరణమైన నిజాయితీని చూపించిన కేరళ ప్రజలకు సెల్యూట్..’ అని వర్మ తన పోస్టులో పేర్కొన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.