యాప్నగరం

షకీలా జీవితంపై సినిమా.. హీరోయిన్‌గా బాలీవుడ్ నటి

శృంగార తార‌గా ఒకప్పుడు మలయాళ సూపర్ స్టార్లనే గడగడలాడించిన షకీల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే, ఆమె అలా మారడం వెనుక పెద్ద కథే ఉంది.

Samayam Telugu 14 Jul 2018, 5:42 pm
శృంగార తార‌గా ఒకప్పుడు మలయాళ సూపర్ స్టార్లనే గడగడలాడించిన షకీల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే, ఆమె అలా మారడం వెనుక పెద్ద కథే ఉంది. హీరోయిన్‌గా ఎదగాలని ఆశపడిన ఆమె... చివరికి శృంగార తార‌గా ఎలా మారిందో ఇప్పటికే ఆమె పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇప్పుడామె జీవిత కథ సినిమాగా రానుంది.
Samayam Telugu 121


ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన షకీలా.. 20 ఏళ్ల వయస్సులో సినీరంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత అవకాశాలు కోసం ప్రయత్నిస్తూ చిన్న, చితక క్యారెక్టర్లు చేసేవారు. నటిగా గుర్తింపు పొందాలే ప్రయత్నంలో ఆమె పలు పెద్దల చిత్రాల్లో నటించక తప్పలేదు. అది క్రమేనా ఆమెకు అవకాశాలు తెచ్చిపెట్టడంతో అందులోనే కొనసాగారు.
ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ చిత్రాల్లో కారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. ఇటీవల ఆమె దర్శకురాలిగా మారారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ మలయాళం పరిశ్రమలో అడుగుపెట్టిన ఆమె.. ‘నీలకురింజి పోదు’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఆమె జీవితంపై తెరకెక్కుతున్న చిత్రాన్ని మలయాళంలో తెరకెక్కించనట్లు తెలిసింది. ఈ సినిమాలో ఆమె పాత్ర కోసం స్వరభాస్కర్, హ్యుమా ఖరేషీల పేర్లను పరిశీలించారు. చివరికి బాలీవుడ్ శృంగార తార‌ రిచా చద్దాను ఎంపిక చేశారు. ఆగస్టు నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. హిందీ, మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.