యాప్నగరం

చిరంజీవి-రాజశేఖర్ మధ్య విభేధాలు అలాగే వున్నాయా ?

తాజాగా హైదరాబాద్ తెలుగు ఫిలిం ఛాంబర్‌లో చోటుచేసుకున్న ఓ ఉదంతం ఆ ఇద్దరి మధ్య విభేధాలు ఇంకా...

TNN 11 Jun 2017, 3:30 pm
చిరంజీవి, రాజశేఖర్ మధ్య ఒకప్పుడు వున్న విభేధాలు ఇప్పుడు లేవని... ప్రస్తుతానికి సమస్య సద్దుమనిగిందని అందరూ భావిస్తున్నారు. కానీ తాజాగా శనివారం నాడు హైదరాబాద్ తెలుగు ఫిలిం ఛాంబర్‌లో చోటుచేసుకున్న ఓ ఉదంతం మాత్రం ఆ ఇద్దరి మధ్య విభేధాలు ఇంకా అలాగే వున్నాయని చెప్పుకునేందుకు మరోసారి అవకాశం ఇచ్చింది. ఇటీవలే మృతిచెందిన దర్శకరత్న దాసరి నారాయణ రావుని స్మరించుకునేందుకు తెలుగు ఫిలింఛాంబర్ శనివారం ఓ సంస్మరణ సభ నిర్వహించింది. ఈ సంస్మరణ సభలో పాల్గొన్న చిరంజీవి వేదికపై దాసరి గురించి మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాతే రాజశేఖర్ ఆ సభలోకి అడుగుపెట్టారు.
Samayam Telugu rift between chiranjeevi and rajashekhar still continues
చిరంజీవి-రాజశేఖర్ మధ్య విభేధాలు అలాగే వున్నాయా ?


చిరంజీవి అక్కడున్నంతసేపు సభకి హాజరుకాని రాజశేఖర్, చిరు వెళ్లిపోగానే ప్రత్యక్షమవడం చూసి అక్కడున్న వారికి అనేక అనుమానాలు కలిగాయి. ఈ ఘటన యాదృశ్చికంగానే జరిగిందని కొంతమంది చెబుతున్నప్పటికీ... అటువంటిదేమీ లేదు ఆ ఇద్దరికీ ఒకరికొకరు తారసపడటం ఇష్టంలేకే ఇలా చేసి వుంటారని ఇంకొంతమంది చెప్పుకుంటున్నారు.

ఠాగూర్ సినిమా రీమేక్ విషయంలోనే వీళ్లిద్దరి మధ్య విభేధాలు తలెత్తాయని సినీవర్గాలు చెబుతుంటాయి. పరిశ్రమవర్గాలు చెప్పుకుంటున్నదాని ప్రకారం.. తమిళంలో హిట్ అయిన రమణ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని భావించిన రాజశేఖర్ అందుకు సంబంధించిన రీమేక్ రైట్స్ దక్కించుకున్నారట. కానీ ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సీన్‌లోకి ఎంటరై, అంతకన్నా ఎక్కువ ఖరీదు పెట్టి ఆ సినిమా రీమేక్ రైట్స్ కొన్నారట. అప్పట్లో ఆ సినిమా ఓ సంచలన విజయం సాధించింది. అప్పటి నుంచే ఆ ఇద్దరి మధ్య విభేధాలు మొదలయ్యాయి అని పరిశ్రమవర్గాలు చెబుతుంటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.