యాప్నగరం

'ఖైదీ నెంబర్ 150'తో చిరు రీ ఎంట్రీపై రోజా ఏమన్నారు

చిరంజీవి నటించిన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 ఈ నెల 11వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో...

Samayam Telugu 7 Jan 2017, 5:56 pm
తెలుగు సినీపరిశ్రమలో ఎంతో క్రేజ్ వున్న నటుడు చిరంజీవి అని అన్నారు సినీనటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా. చిరంజీవి నటించిన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 ఈ నెల 11వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇవాళ గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిరంజీవి కమ్‌బ్యాక్ గురించి టీవీ9తో మాట్లాడుతూ... మెగాస్టార్ చిరంజీవి అంటే డాన్స్‌కి పెట్టింది పేరు, చిరు ఫైట్స్‌ని అభిమానులు విరగబడి చూసేవారు. 9 సంవత్సరాల తర్వాత మళ్లీ చిరు రీ ఎంట్రీ ఇవ్వడం నిజంగా ఆయన అభిమానులకి ఎంతో సంతోషకరమైన విషయం. మెగాస్టార్‌తో కలిసి ముఠామేస్త్రీ, ముగ్గురు మొనగాళ్లు, బిగ్ బాస్ చిత్రాల్లో నటించాను. ఆయనతో డాన్స్ చేయడం చాలా కాంపిటీషన్‌గా అనిపించేది అని అభిప్రాయపడ్డారు రోజా.
Samayam Telugu roja speaks about chiranjeevis khaidi no 150 movie and his re entry
'ఖైదీ నెంబర్ 150'తో చిరు రీ ఎంట్రీపై రోజా ఏమన్నారు


జీవితంలో సినిమా వేరు, పాలిటిక్స్ వేరు. చిరంజీవి మంచి మనిషి. సినిమాల్లో చిరంజీవి ఎప్పుడూ ది బెస్ట్. డాన్స్, పర్‌ఫార్మెన్స్, ఫైట్స్ అన్నింట్లోనూ చిరు బెస్ట్. చిరు నటించిన ఆపద్బాంధవుడు, రుద్రవీణ వంటి సినిమాలు చాలా ఇష్టం. ఖైదీ సినిమా చిరుకి ఎంత పేరు తీసుకువచ్చిందో ఈ ఖైదీ నెంబర్ 150 కూడా అంతే పేరు తీసుకురావాలి... అంతే సక్సెస్ కావాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.