యాప్నగరం

మీడియా గొప్పదా? కామన్ మ్యానా?

ఎంత పెద్దోడైనా..ఎంత గొప్పోడైనా ఎంత తెలివైనోడైనా..ఎవ్వడైనా మీడియా ముందు తలదించాల్సిందే. దేశంలో వ్యక్తికో ఛానల్, పార్టీకో ఛానల్, ప్రాంతనికో ఛానల్ పుట్టుకొస్తున్నాయ్...

TNN 25 Aug 2016, 8:21 pm
ఎంత పెద్దోడైనా..ఎంత గొప్పోడైనా ఎంత తెలివైనోడైనా..ఎవ్వడైనా మీడియా ముందు తలదించాల్సిందే. దేశంలో వ్యక్తికో ఛానల్, పార్టీకో ఛానల్, ప్రాంతనికో ఛానల్ పుట్టుకొస్తున్నాయ్. ఇలాంటి డేరింగ్ మాటలతో.. మీడియా ఉంటే ఏమైనా చేసేయచ్చు అనుకునే ఓ బడా మీడియా అధినేతకు, సామాన్యుడికి మధ్య జరిగే యుద్ధమే 'మనలో ఒకడు'. ఈ సినిమా టీజర్ మీడియా మొఘల్ రామోజీ రావుతో విడుదల చేయించారు.
Samayam Telugu rp patnaiks manalo okadu movie teaser
మీడియా గొప్పదా? కామన్ మ్యానా?




సంగీత దర్శకునిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆర్పీ పట్నాయక్ ఆ తర్వాత నటుడిగా, దర్శకునిగా మెప్పించారు. పట్నాయక్ రూపొందించిన 'బ్రోకర్' సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఓ సామాజిక అంశంతో 'మనలో ఒకడు' సినిమా తెరకెక్కిస్తున్నారు. యధార్థ సంఘటనల ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ సినిమాలో ఆర్పీ పట్నాయక్, అనిత, సాయి కుమార్, శ్రీముఖి, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. ఈ నెల 27న 'మనలో ఒకడు' ఆడియో విడుద‌ల చేసి త్వరలోనే సినిమా విడుదల చేయనున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు.



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.