యాప్నగరం

నా పేరు సూర్య.. శాటిలైట్ రికార్డు ధరకు!

డిజిటల్ మార్కెట్ లో తన పట్టేమిటో మరోసారి నిరూపించుకున్నాడు అల్లు అర్జున్.

TNN 26 Dec 2017, 3:28 pm
డిజిటల్ మార్కెట్ లో తన పట్టేమిటో మరోసారి నిరూపించుకున్నాడు అల్లు అర్జున్. శాటిలైట్, డిజిటల్ రైట్స్ విషయంలో అల్లు అర్జున్ స్టామినా మరోసారి రుజువు అయ్యింది. ఇదంతా ఈ హీరో తాజా సినిమా ‘నా పేరు సూర్య’ విషయంలో. వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఏకంగా పాతిక కోట్ల రూపాయలకు పలికాయని సమాచారం.
Samayam Telugu rs 25 crore for naa peru surya rights
నా పేరు సూర్య.. శాటిలైట్ రికార్డు ధరకు!


టీవీలో ప్రసారం చేసుకునే హక్కులతో పాటు డిజిటల్ మీడియా ప్రసార హక్కులను కూడా ఒక సంస్థ కొనుగోలు చేసిందని సమాచారం. పాతిక కోట్ల రూపాయల మొత్తాన్ని వెచ్చించడానికి సదరు సంస్థ ఏ మాత్రం వెనుకాడలేదని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇటీవలి సినిమా థియేటర్ల వద్ద కన్నా వెబ్ మీడియాలో, టీవీలో బాగా హిట్ అయ్యాయి.

ఈ హీరో సినిమాలు సరైనోడు, డీజేలకు బెస్ట్ టీఆర్పీలు వచ్చాయి. సరైనోడు డబ్బింగ్ వెర్షన్లను యూట్యూబ్ లో పెడితే వాటికి రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ హీరో తదుపరి సినిమాకు ఈ భారీ నంబర్ వినిపిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ సింహభాగం శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలోనే రికవర్ అవుతుండటం దీని నిర్మాతలకు కూడా ఉత్సాహాన్ని ఇస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.