యాప్నగరం

అజ్ఞాతవాసి సినిమాకు వెంకీ పాత సినిమాకు సంబంధం వుందా ?

టాలీవుడ్‌లో వున్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్ జాబితాలో టాప్ లిస్టులో వుండే త్రివిక్రమ్ కూడా అప్పుడప్పుడు కాపీక్యాట్ ఆరోపణలు ఎదుర్కున్న..

TNN 10 Nov 2017, 9:19 pm
టాలీవుడ్‌లో వున్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్ జాబితాలో టాప్ లిస్టులో వుండే త్రివిక్రమ్ కూడా అప్పుడప్పుడు కాపీక్యాట్ ఆరోపణలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అతడు, అఆ లాంటి సినిమాలు అలాంటి ఆరోపణలు ఎదుర్కున్నవే. ఇదిలావుంటే, తాజాగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న పవన్ కల్యాణ్ సినిమాపై సైతం మళ్లీ అవే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సెట్స్‌పై వున్న త్రివిక్రమ్ సినిమా స్టోరీ ఇదేనంటూ ఇటీవల కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఆ కథనాలు వెలువడిన అనంతరం ఆ సినిమా స్టోరీని విక్టరీ వెంకటేష్ నటించిన ఓ పాత సినిమాకు ముడిపెడుతూ మళ్లీ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి.
Samayam Telugu rumours milling about pspk25 story inspired from venkys film
అజ్ఞాతవాసి సినిమాకు వెంకీ పాత సినిమాకు సంబంధం వుందా ?


వెంకీ హీరోగా వచ్చిన ఆనాటి రివేంజ్ డ్రామా ఒంటరి పోరాటం సినిమా అందరికీ గుర్తుండే వుంటుంది. కే రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విలన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న అతడి బాధితురాలి పాత్రలో నటించిన జయసుధ అందుకు వెంకటేష్‌ని మార్గంగా ఎంచుకుంటుంది. తమ ఇద్దరికీ శత్రువు ఒక్కడే కావడంతో ఆ సినిమాలో హీరోగా నటించిన వెంకీ సైతం జయసుధ చెప్పిన పథకం ప్రకారమే తన ప్రతీకారం తీర్చుకుంటాడు.

సరిగ్గా ఇదే స్టోరీని ఇనిస్పిరేషన్‌గా తీసుకుని త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమాను తెరకెక్కిస్తున్నాడనేది కొందరి అభిప్రాయం. ఆనాడు ఆ సినిమాలో జయసుధ పోషించిన పాత్రలోనే ఈ సినిమాలో ఖుష్బు నటిస్తోందనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఈ ఆరోపణలపై త్రివిక్రమ్ అండ్ టీమ్ ఏమని స్పందిస్తుందో వేచిచూడాల్సిందే మరి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.