యాప్నగరం

Mahasamudram Movie: ‘మహా సముద్రం’ ఈదేస్తున్న RX100 దర్శకుడు!

కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘RX100’ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసి కలెక్షన్ల వర్షం కురిపించింది. వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అజయ్ భూపతి తొలిచిత్రంతోటే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని క్రేజీ దర్శకుడిగా మారారు.

Samayam Telugu 6 Feb 2019, 7:30 pm
కథలో కంటెంట్ ఉండాలే కాని బోల్డ్ కంటెంట్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టచ్చని రుజువు చేశారు RX100 దర్శకుడు అజయ్ భూపతి. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సంచ లన విజయాన్ని నమోదు చేసి కలెక్షన్ల వర్షం కురిపించింది. వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అజయ్ భూపతి తొలిచిత్రంతోటే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని క్రేజీ దర్శకుడిగా మారారు. ఎక్కడి నుండో తెచ్చుకున్న అరువు కథలు ఎందుకు నీ ప్రేమ కథనే సినిమాగా తీసెయ్ అంటూ వర్మ ఇచ్చిన సలహాను ‘RX100’ చిత్రంగా ఆవిష్కరించాడు దర్శకుడు.
Samayam Telugu Mahasamudram Movie



ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించడంతో అజయ్ భూపతి నెక్స్ట్ మూవీ ఏం చేస్తున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. తాజాగా ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ‘మహాసముద్రం’ అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో సాయి శ్రీనివాస్‌కు జోడీగా సమంత నటిస్తున్నట్టు సమాచారం. గతంలో ‘అల్లుడు శీను’ చిత్రంతో జోడీ కట్టిన ఈ జంట లేటెస్ట్‌గా ‘మహా సముద్రం’ ఈదనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ‘RX100’ చిత్రంలో తన గ్లామర్ షోతో కుర్రకారుకి పెచ్చెక్కించిన పాయల్ రాజ్ పుత్ ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించనున్నట్టు తెలుస్తుంది. వీటిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న అజయ్ భూపతి త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్లబోతున్నారు. తొలిచిత్రానికి వినూత్నంగా ‘RX100’ అనే ఆంగ్ల టైటిల్‌ను పెట్టుకున్న అజయ్ భూపతి.. రెండో చిత్రానికి ‘మహా సముద్రం’ అనే కాన్సెప్ట్ బేస్డ్ టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. ‘RX100’తో రొమాంటిక్ లవ్ స్టోరీ‌ని వినిపించిన అజయ్ భూపతి ‘మహా సముద్రం’ చిత్రాన్ని ఓ జానర్‌లో రూపొందిస్తారో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.