యాప్నగరం

ఐటెం సాంగ్‌కి పాయల్ గ్రీన్‌సిగ్నల్ ..?

హీరోతో లిప్‌లాక్స్‌లో పాయల్ రాజ్‌పుత్ రెచ్చిపోయిన తీరుకి కుర్రకారు ఫిదా అయ్యారు. దీంతో.. ఆమెకి ఆఫర్లు వరుస కడతాయని అంతా భావించారు. కానీ..?

Samayam Telugu 15 Sep 2018, 8:20 pm
టాలీవుడ్‌లో హాట్ లుక్స్‌లో కుర్రాళ్ల మదిదోచిన ‘ఆర్‌ఎక్స్ 100’ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఐటెం సాంగ్‌‌ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా సూపర్ హిట్‌ టాక్‌ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ముఖ్యంగా.. హీరోతో లిప్‌లాక్స్‌లో పాయల్ రాజ్‌పుత్ రెచ్చిపోయిన తీరుకి కుర్రకారు ఫిదా అయ్యారు. దీంతో.. ఆమెకి ఆఫర్లు వరుస కడతాయని అంతా భావించారు. కానీ.. ఇప్పటికీ పాయల్ రాజ్‌పుత్‌కి చెప్పుకోదగ్గ ఆఫర్లు ఏవీ రాలేదట. దీంతో ఈ ముద్దుగుమ్మ ఐటెం సాంగ్‌ని చేసేందుకు కూడా రెడీ అయినట్లు టాలీవుడ్ టాక్.
Samayam Telugu Telugu-image


తేజ దర్శకత్వంలో బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న సినిమాలో ఐటెం సాంగ్‌‌ చేయమని పాయల్ రాజ్‌పుత్‌‌ను నిర్మాత బెల్లకొండ సురేశ్ అడిగారట. సాంగ్‌కి భారీ పారితోషికం కూడా ఆఫర్ చేయడంతో.. పాయల్‌ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బెల్లకొండ శ్రీనివాస్ సరసన తమన్నా ఐటెం సాంగ్‌లో నర్తించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.