యాప్నగరం

కరోనాతో ఆసుపత్రిలో బాల సుబ్రహ్మణ్యం.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ హెల్త్ బులెటిన్

కరోనా బారిన పడిన లెజెండరీ సింగర్ బాల సుబ్రహ్మణ్యం గత కొన్ని రోజులుగా చెన్నైలోని చులైమెడులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.

Samayam Telugu 14 Aug 2020, 9:35 am
దేశంలో కరోనా విలయతాండవానికి బ్రేకులు పడే అవకాశమే కనిపించడం లేదు. నిత్యం వేలల్లో కేసులు నమోదవుతుండటం దేశ ప్రజలను భాయాందోళనలకు గురిచేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వీర విజృంభణ చేస్తోంది. సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల దాకా కరోనా బారిన పడుతున్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి అమితాబ్ బచ్చన్, రాజమౌళి, విశాల్, నిర్మాత బండ్ల గణేష్ లాంటి ప్రముఖులు కరోనా బారినపడి కోలుకున్నారు. అయితే రీసెంట్‌గా లెజెండరీ సింగర్ బాల సుబ్రహ్మణ్యం కూడా కరోనా బారిన పడటంతో ప్రేక్షకులు కాస్త ఆందోళన చెందారు.
Samayam Telugu బాల సుబ్రహ్మణ్యం హెల్త్ అప్ డేట్
S. P. Balasubrahmanyam


తనకు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా వెల్లడించిన బాల సుబ్రహ్మణ్యం.. ప్రస్తుతం చెన్నైలోని చులైమెడులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని పేర్కొన్నారు. నిజానికి బాలుకు ఆసుపత్రిలో చికిత్స అవసరం లేదని, హోమ్ క్వారంటైన్ చాలని వైద్యులు చెప్పినప్పటికీ.. కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక హాస్పిటల్‌లోనే ఆయన ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

Also Read: నిక్కీ గల్రానీకి కరోనా పాజిటివ్.. నా వ్యాధి లక్షణాలు ఇవీ అంటూ ఎమోషనల్ ట్వీట్

ప్రస్తుతం బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, శరీరానికి కావాల్సినంత ఆక్సీజన్ చక్కగా అందుతోందని ఈ హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో బాలు ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందవల్సిన అవసరం లేదని తెలుస్తోంది. త్వరలోనే ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశార్జ్ చేయనున్నారని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.