యాప్నగరం

ప్రభాస్ ‘సాహో’ ఫస్ట్ లుక్ అప్ డేట్!

ప్రభాస్ ‘బాహుబలి2’ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కానుండటంతో.. అభిమానులకు మరో ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు డార్లింగ్.

TNN 19 Apr 2017, 4:23 pm
రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన తదుపరి చేయబోయే సినిమాలపై కూడా అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. రన్ రాజా రన్ సినిమా తరువాత ప్రభాస్‌తో సినిమా చేయాలని ఎన్నో రోజులుగా ఎదురుచూసిన సుజీత్ దర్శకత్వంలో తన 19వ సినిమా మొదలు పెట్టాడు ప్రభాస్.
Samayam Telugu sahoo first look prabhas sujeeth movie first look release date
ప్రభాస్ ‘సాహో’ ఫస్ట్ లుక్ అప్ డేట్!


తన సొంత బ్యానర్ అయిన యు.వి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రభాస్ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న రెండో చిత్రమిది. ఈ చిత్రానికి 'సాహో' అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమా టీజర్‌ను బాహుబలి ది కంక్లూజన్ సినిమాతో పాటు రిలీజ్ చేస్తారని, బాహుబలి సినిమా ప్రదర్శింపబడే ప్రతి థియేటర్‌లో 'సాహో' టీజర్ రిలీజ్ అవుతుందని అన్నారు.

తాజాగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది చిత్రబృందం. దాదాపు నాలుగు భాషల్లో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తున్నారు. అలానే టీజర్ కంటే ముందుగా టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఏప్రిల్ 23న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కన్నడ భామ రష్మిక కనిపించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.