మెగా బ్యాక్‌డ్రాప్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తనదైన చరిష్మాతో సుప్రీం హీరో (Supreme Hero)గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej). నటనలో ఈజ్, కామెడీ టైమింగ్‌కు తోడు డ్యాన్సింగ్ స్కిల్స్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ‘పిల్లా నువ్వులేని జీవితం, సుప్రీమ్, సుబ్రమణ్యం ఫర్ సేల్, ప్రతిరోజు పండగే’ వంటి హిట్ సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ కొంత మార్కెట్ క్రియేట్ చేసుకోగలిగాడు. అయితే తను నటించిన ‘రిపబ్లిక్’ మూవీ రిలీజ్ టైమ్‌లో యాక్సిండెట్‌కు గురై, కొంతకాలం సినిమాలకు దూరమైన సాయి.. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలర్స్ స్వాతి (Colors Swathi) తో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించాడు. సాయి ధరమ్ తేజ్ తన ఫ్రెండ్స్ హర్షిత్ రెడ్డి, నవీన్‌తో కలిసి ఓ స్పెషల్ కాజ్ కోసం స్పెషల్ మ్యూజికల్ షార్ట్ (Musical short)ను తీసుకొస్తు్న్నాడు. ఇందులో తనకు జోడీగా హీరోయిన్ స్వాతి రెడ్డి కనిపించనుంది. ఇండియాలో గుర్తింపునకు నోచుకోని, చరిత్రలో కనుమరుగైన గొప్ప వీరులకు మ్యూజికల్ ట్రిబ్యూట్‌గా ఈ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మెగా హీరో ట్విట్టర్లో పంచుకున్నారు. ‘నా ఫ్రెండ్స్(ఫ్యామిలీనే) అభిరుచి గల ఓ స్పెషల్ ప్రాజెక్ట్‌తో మీ ముందుకొస్తున్నారు. సాధారణంగా ఫ్రెండ్స్ కలిసి ఏదైనా చేశారంటే అది ప్రేమతో చేయబడుతుంది. ఈ విషయాన్ని మీతో పంచుకునేందుకు వెయిట్ చేయలేను’ అంటూ మ్యూజికల్ షార్ట్ ఫీచర్ పోస్టర్‌ను షేర్ చేశారు.
‘సత్య’ పేరు రివీల్ చేసిన ఈ పోస్టర్లో సాయిధరమ్ తేజ్‌ను స్వాతి గట్టిగా హత్తుకుని ఉండటంతో కంటెంట్‌పై ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి. ఈ మ్యూజికల్ షార్ట్‌కు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించగా.. దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. శృతి రంజని సంగీతం సమకూర్చగా, బాలాజీ సుబ్రమణ్యం కెమెరా వర్క్ అందిస్తున్నారు.
సాయిధరమ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి తమిళ చిత్రం ‘వినోదయం సిత్తం’ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నాడు. మాతృకలో నటిస్తూ దర్శకత్వం వహించిన సముద్ర ఖనినే తెలుగులో కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదేకాకుంగా గతేడాది డిసెంబర్ నెలలో ‘విరూపాక్ష’ పేరుతో ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. బీవీఎన్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ దండు డైరెక్ట్ చేయనుండగా.. సంయుక్త మీనన్ ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

- Read Latest Tollywood Updates and Telugu News