యాప్నగరం

సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై తాజా ప్రకటన.. నిపుణుల పర్యవేక్షణలో యువ హీరో

గత శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన యువ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయంపై అపోలో ఆస్పత్రి వైద్యులు ఓ ప్రకటనను విడుదల చేశారు.

Samayam Telugu 14 Sep 2021, 4:01 pm
మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు. ‘పిల్ల నువ్వులేని జీవితం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. అప్పటి నుంచి ఇప్పటివరకూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్‌గా ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నారు సాయి ధరమ్. త్వరలో ‘రిపబ్లిక్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఆయన రానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి చాలా అప్‌డేట్స్ వచ్చాయి. కానీ, ఇంతలోనే ఓ దురదృష్ట సంఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu సాయి ధరమ్ తేజ్
Sai Dharam Tej


గత శుక్రవారం తన స్పోర్ట్స్‌ బైక్‌పై దుర్గం చెరువు బ్రిడ్జి మీదుగా ప్రయాణం చేస్తున్న ఆయన ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఐకియా-కేబుల్‌బ్రిడ్జ్ దాటిన త‌ర్వాత మైండ్‌స్పేస్ జంక్ష‌న్ ప్రాంతంలో సాయితేజ్ ప్ర‌యాణిస్తున్న బైక్ స్కిడ్ అయ్యింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మొదలు అక్కడ ఉన్న వాళ్లు ఆయన్ని మెడికొవర్ ఆస్పత్రిలో చేర్పించగా.. ఆ తర్వాత అక్కడి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన కాలర్ ఎముక విరగడంతో రెండు రోజుల క్రితం అక్కడి వైద్యులు దానికి శస్త్ర చికిత్స అందించారు. ఎప్పటికప్పుడు సాయి ధరమ్ ఆరోగ్యం గురించి వైద్యులు అభిమానులకు సమాచారం అందిస్తున్నారు.

తాజాగా మంగళవారం కూడా ఆయన హెల్త్ బులిటెన్‌ను వైద్యులు విడుదల చేశారు. ‘ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. తాత్కాలికంగా ఆయన పరికరాల మద్దతుతో ఆయన శ్వాస తీసుకుంటున్నారు. కీలక పారామీటర్లు, బయో మెడికల్ టెస్టుల్లో ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతోంది’’ అంటూ అపోలో ఆస్పత్రి తాజా ప్రకటనలో పేర్కొంది. ఇక సాయి ధరమ్ తేజ్‌ను ఇప్పటికే సినిమా ప్రముఖులు పరామర్శించారు. అంతేకాక.. ఆయన త్వరగా కోలుకోవాలి అంటూ అభిమానులు ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.