యాప్నగరం

సాయిధరమ్ 'ఇంటెలిజెంట్‌' రిలీజ్ డేట్ ఫిక్స్

సాయి ధరమ్ తేజ్- వివి వినాయక్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఇంటెలిజెంట్’ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది చిత్రయూనిట్.

TNN 4 Jan 2018, 9:04 pm
సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రానికి 'ఇంటెలిజెంట్‌'. ఇటీవలే ఈ చిత్రానికి టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు.
Samayam Telugu sai dharam tej intelligent gets official release date
సాయిధరమ్ 'ఇంటెలిజెంట్‌' రిలీజ్ డేట్ ఫిక్స్


ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి సంబంధించిన మస్కట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ప్రస్తుతం క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్‌ ఉన్నాయి. జనవరి 17 వరకు టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. చిరంజీవిగారికి 'ఖైదీ' ఓ మెమరబుల్‌ మూవీగా నిలిచింది. అలాగే 'ఇంటెలిజెంట్‌' సాయిధరమ్‌కి ఓ ల్యాండ్‌ మార్క్‌ మూవీ అవుతుందని'' అన్నారు.

సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, వినీత్‌కుమార్‌, జె.పి. పృథ్వీ, రుబాబు, కాదంబరి కిరణ్‌, విద్యుల్లేఖా రామన్‌, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, భద్రం తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.