యాప్నగరం

లోకల్ నాని‌తో నాన్ లోకల్ బ్యూటీ రొమాన్స్!

ప్రేమమ్ సినిమాతో అందానికి అభినయం జోడించి కుర్రకారు గుండెల్లో ప్రేమ రైళ్లు పరుగెత్తించిన సాయి పల్లవి తెలుగులో మరో బంఫర్ ఆఫర్ కొట్టేసింది.

TNN 9 Feb 2017, 4:02 pm
ప్రేమమ్ సినిమాతో అందానికి అభినయం జోడించి కుర్రకారు గుండెల్లో ప్రేమ రైళ్లు పరుగెత్తించిన సాయి పల్లవి తెలుగులో మరో బంఫర్ ఆఫర్ కొట్టేసింది. దిల్ రాజు ప్రొడక్షన్‌లో డబుల్ హ్యాట్రిక్ హీరో నాని నటిస్తోన్న మూవీలో ఈ భామ చాన్స్ కొట్టేసినట్లు టాక్.
Samayam Telugu sai pallavi in nani nataraju movie
లోకల్ నాని‌తో నాన్ లోకల్ బ్యూటీ రొమాన్స్!


ఈ చిత్రానికి నటరాజ్ అనే పేరు పరిశీలనలో ఉండగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో వరుణ్ తేజ్‌తో ఆడిపాడుతున్న సాయి పల్లవి .. మలయాళంలో వరుస ఆఫర్స్‌తో బిజీగా ఉంది. అయితే వేణు శ్రీరామ్ చెప్పిన కథ నచ్చడం.. అందులో తన పాత్రకి తగినంత ప్రాధాన్యత ఉండటంతో ప్రస్తుతం సాయి పల్లవి డేట్స్ సర్దుబాటు చేసే పనిలో పడిందట. నటరాజు టైటిల్ నానికి పెర్ఫెక్ట్ సూట్ అని కామెంట్స్‌తో పాటు ప్రేమమ్ బ్యూటీ నేచురల్ స్టార్‌‌కి ఇంకా పెర్ఫెక్ట్ అంటూ నాని ఫ్యాన్స్ ఈ సినిమాకోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.