యాప్నగరం

`రైట్ రైట్` అంటున్న మెగా హీరో

ఇద్దరు హీరోల సినిమాల షూటింగ్స్ ఒకే ఏరియాలో పక్క పక్క జరిగితే.. ఆ ఇద్దరు హీరోలు బ్రేక్ టైమ్‌లో కలుసుకుని, కాసేపు కబుర్లు చెప్పుకుంటారు.

Samayam Telugu 5 Mar 2016, 12:28 am
ఇద్దరు హీరోల సినిమాల షూటింగ్స్ ఒకే ఏరియాలో పక్క పక్క జరిగితే.. ఆ ఇద్దరు హీరోలు బ్రేక్ టైమ్‌లో కలుసుకుని, కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఆ హీరోలిద్దరూ మంచి స్నేహితులైతే చెప్పడానికింకేం వుంటుంది... తాము చేసే చిత్రాలు హిట్టవ్వాలని కోరుకుంటారు. ఇటీవల సాయిధరమ్ తేజ్, సుమంత్ అశ్విన్ కలుసుకున్నప్పుడు కూడా అదే సీన్ కనిపించింది. సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సుప్రీమ్' చిత్రం షూటింగ్, సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందుతున్న 'రైట్ రైట్' షూటింగ్ ఇటీవల పక్క పక్కనే జరిగాయి. ఈ ఇద్దరూ చిన్నప్పట్నుంచీ మంచి స్నేహితులు. దాంతో బ్రేక్ టైమ్‌లో 'సుప్రీమ్' హీరో సాయిధరమ్ తేజ్.. క్యూట్ హీరో సుమంత్ అశ్విన్‌ని కలవడానికి 'రైట్ రైట్' షూటింగ్ లొకేషన్‌కి వెళ్లాడు. ఈ స్నేహితులిద్దరూ కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు. 'రైట్ రైట్' బృందానికి సాయిధరమ్ తేజ్ శుభాకాంక్షలు చెప్పి, మళ్లీ తన షూటింగ్ లొకేషన్‌కి వెళ్లాడు.
Samayam Telugu saidharam tej and sumanth ashwin seen chit chatting in right right sets
`రైట్ రైట్` అంటున్న మెగా హీరో


సుమంత్ అశ్విన్ హీరోగా మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న `రైట్ రైట్‌` చిత్రంలో `బాహుబ‌లి` ఫేమ్ ప్ర‌భాక‌ర్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. పూజా జ‌వేరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంతో జరుగుతోంది. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.