యాప్నగరం

ఆ హీరో వరుణ్ తేజ్ కాదు.. సాయిధరమ్ తేజేనట!

ఓ మల్టీస్టారర్ సినిమా కోసం మెగా హీరో వరుణ్ తేజ్‌ని తీసుకోవాలని భావించినప్పటికీ.. తాజాగా అతడి స్థానంలో సాయిధరమ్ తేజ్...

TNN 12 Nov 2017, 4:15 pm
రాజా ది గ్రేట్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్న మల్టీస్టారర్ సినిమా F2( ఫన్ అండ్ ఫస్ట్రేషన్)లో ఫస్ట్ లీడ్ రోల్ కోసం దాదాపు వెంకీ పేరు ఖరారైనట్టు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇక మిగిలిన రెండో హీరో స్థానంలో మెగా హీరో వరుణ్ తేజ్‌ని తీసుకుంటున్నారని ఇటీవల కాలంలో ఓ టాక్ వినిపించింది. ఫిదా సినిమాతో సక్సెస్ ట్రాక్‌లో వున్న వరుణ్ తేజ్ ఆ పాత్రకు కరెక్టుగా సెట్ అవుతాడని మేకర్స్ భావించినట్టు తెలిసింది. కానీ వాస్తవానికి అసలు విషయం వేరే వుందట.
Samayam Telugu saidharam tej to act with venkatesh in anil ravipudis multistarrer
ఆ హీరో వరుణ్ తేజ్ కాదు.. సాయిధరమ్ తేజేనట!


లేటెస్ట్ ఫిలింనగర్ అప్‌డేట్స్ ప్రకారం.. ఈ సినిమాలో సెకండ్ హీరో స్థానంలో నటించబోయే నటుడు వరుణ్ తేజ్ కాదట. అవును, ఆ స్థానం సాయిధరమ్ తేజ్‌దే అని సినీవర్గాలు చెబుతున్నాయి. పటాస్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన రెండో సినిమా సుప్రీంలో నటించిన సాయిధరమ్ తేజ్‌తో అతడికి మంచి అనుబంధం వుంది.

రాజా ది గ్రేట్ షూటింగ్ జరుగుతున్న సందర్భంలోనూ అక్కడ ప్రత్యక్షమై అనిల్ రావిపూడికి తన వంతు ప్రచారం కల్పించాడు సాయిధరమ్ తేజ్. అందుకే అనిల్ రావిపూడి తన మల్టీస్టారర్ కోసం సెకండ్ లీడ్ రోల్ స్థానంలో అతడినే తీసుకోవాలని అనుకుంటున్నాడనేది తాజాగా వినిపిస్తున్న టాక్ సారాంశం. అంతిమంగా ఆ స్థానం ఎవరికి వెళ్తుందో తెలియాలంటే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచిచూడాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.