యాప్నగరం

హీరో కూతురు.. ఆ కుర్రాడితో ప్రేమలో!

ఇప్పుడిప్పుడే బాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ అవుతున్న

TNN 27 Dec 2017, 4:23 pm
ఇప్పుడిప్పుడే బాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ అవుతున్న సైఫ్ అలీ ఖాన్ తనయ సారా అలీఖాన్ గురించి గాసిప్స్ గుప్పుమంటున్నాయి. బాలీవుడ్‌ను బాగా ఎదురుచూపుల్లో పెట్టి.. చివరకు వెండితెరపై కనిపించడానికి సమాయత్తం అవుతోంది సారా. ప్రస్తుతం ఈమె ఇంట్రడక్షన్ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
Samayam Telugu saifs lil girl finds her beau
హీరో కూతురు.. ఆ కుర్రాడితో ప్రేమలో!


ఆ సంగతలా ఉంటే.. అంతకు మించిన ఆసక్తిదాయకమైన విషయం ఒకటి చర్చనీయాంశంగా మారింది. అదే సారా అలీఖాన్ ప్రేమ వ్యవహారం. టీనేజర్ సారా ఒక కుర్రాడితో ప్రేమలో పడిందని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కొంటున్నారు. అతడు మరెవరో కాదు.. అనిల్ కపూర్ తనయుడు హర్షవర్ధన్ కపూర్.

వీళ్ల తల్లిదండ్రులు బాలీవుడ్ నేపథ్యాన్ని కలిగిన వారే కావడంతో వీళ్లిద్దరూ చిన్నప్పటి నుంచి పరిచయస్తులే. ఈ నేపథ్యంలో ఆ స్నేహం ప్రేమగా చిగురించిందని సమాచారం. వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారని.. తరచూ సమావేశం అవుతున్నారని కూడా బాలీవుడ్ పత్రికలు రాస్తున్నాయి. అయితే ఈ ప్రేమ వ్యవహారంపై వీళ్లిద్దరూ కానీ, వీరి పేరెంట్స్ కానీ స్పందించలేదింకా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.