యాప్నగరం

సల్మాన్‌కు శిక్ష ఖరారు.. వాళ్లకు రిలీఫ్..!

ఒకే కేసులో కడదాకా నిందితులుగా నిలిచినప్పటికీ సల్మాన్ ఖాన్ సహనటులకు రిలీఫ్ దొరకగా, సల్మాన్ మాత్రం బుక్ అయిపోయాడు. ఇరవై సంవత్సరాల

TNN 5 Apr 2018, 2:44 pm
ఒకే కేసులో కడదాకా నిందితులుగా నిలిచినప్పటికీ సల్మాన్ ఖాన్ సహనటులకు రిలీఫ్ దొరకగా, సల్మాన్ మాత్రం బుక్ అయిపోయాడు. ఇరవై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిన విచారణతో సల్మాన్ దోషిగా తేలాడు. రెండు కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ కు ఐదు సంవత్సరాల పాటు శిక్ష పడింది. ఈ కేసులో సల్మాన్ ను దోషిగా తేల్చిన జోధ్‌పూర్ కోర్టు తాజాగా శిక్షను కూడా ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.
Samayam Telugu salmankh.


వాస్తవానికి ఈ కేసులో సల్మాన్ తో పాటు ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమాలో నటించిన సైఫ్ అలీఖాన్, టబు, సోనాలీబింద్రే, నీలమ్ లు కూడా నిందితులుగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే విరామంలో వీళ్లు జింకలను వేటాడారు. కడదాకా వారు కూడా కోర్టు విచారణకు హాజరవుతూ వచ్చారు. అయితే వారి ప్రమేయంపై సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిని నిర్దోషులుగా విడిచిపెట్టింది న్యాయస్థానం. అయితే సల్మాన్ మాత్రం తప్పించుకోలేకపోయాడు.

సల్మాన్ దోషి అని కోర్టు ప్రకటించగా.. చేసేది లేక తక్కువ శిక్షను విధించాలని సల్మాన్ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరారు. అయితే దానికి ఆయన నిరాకరిస్తూ, ఐదు సంవత్సరాల జైలు శిక్షను, పదివేల రూపాయల జరిమానాను విధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.