యాప్నగరం

సల్మాన్ ఖాన్‌ని వెంటాడుతున్న 'వేట' కేసు

సల్మాన్ ఖాన్‌ని కృష్ణజింకల వేట కేసు ఇంకా వెంటాడుతూనే వుంది. తాజాగా శుక్రవారం సల్మాన్ ఖాన్‌కి ఇదే కేసుకు సంబంధించి....

TNN 12 Nov 2016, 5:30 am
సల్మాన్ ఖాన్‌ని కృష్ణజింకల వేట కేసు ఇంకా వెంటాడుతూనే వుంది. తాజాగా శుక్రవారం సల్మాన్ ఖాన్‌కి ఇదే కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సల్మాన్ నిర్ధోషి అని రాజస్థాన్ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ... ఆ తీర్పుని సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకి వెళ్లిన ఆ రాష్ట్ర ప్రభుత్వం సల్మాన్‌ని లొంగిపొమ్మని ఆదేశాలు జారీ చేయాల్సిందిగా అక్టోబర్ 19న సుప్రీం కోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేసింది.
Samayam Telugu salman khan poaching case supreme court issues notice to salman
సల్మాన్ ఖాన్‌ని వెంటాడుతున్న 'వేట' కేసు


ఈ పిటీషన్‌ని విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు.. దీనిపై వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సల్మాన్‌కి నోటీసులు జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.