యాప్నగరం

గూగుల్ సెర్చ్‌లో సల్మాన్, సన్నీలే టాప్

గూగుల్ అంతర్జాలంలో భారతీయ ప్రజలు ఏ నటీనటులు గురించి ఎక్కువగా వెతికి ఉంటారు...

TNN 16 Jul 2016, 8:06 am
గూగుల్ అంతర్జాలంలో భారతీయ ప్రజలు ఏ నటీనటులు గురించి ఎక్కువగా వెతికి ఉంటారు... అనే విషయమై గూగుల్ తాజాగా ఓ రిపోర్టును బయటపెట్టింది. అందులో గత పదేళ్లలో అత్యధికంగా సల్మాన్, సన్నీ లియోన్ల కోసం భారత నెటిజన్లు గూగుల్ జల్లెడ పట్టారంటా. అంటే నటుల్లో సల్మాన్ ఖాన్ గురించి, నటీమణుల్లో సన్నీ లియోన్ గురించి వెతికారంటా. సల్మాన్ ఎలాగూ టాప్ మనకి తెలుసు కానీ... ప్రియాంక, కరీనా, దీపికా, కత్రినా... వంటి స్టార్ నటీమణులను సన్నీ వెనక్కి నెట్టేయడం మాత్రం నిజంగా గ్రేటే కదా. గత పదేళ్లలోనే కరీనా, కత్రినా, దీపిక, ప్రియాంక సూపర్ స్టార్లయ్యారు. సన్నీ తెరంగేట్రం ఇచ్చింది కూడా అదేసమయంలో. అయినా సన్నీ వారిని మించిపోయింది. కేవలం అడల్ట్ స్టార్ కావడమే అందుకు కారణమని కూడా చెప్పుకోవచ్చు.
Samayam Telugu salman khan sunny leone are googles most searched indian actors
గూగుల్ సెర్చ్‌లో సల్మాన్, సన్నీలే టాప్


ఇక సల్మాన్ మొదటి స్థానంలో నిలువగా తరువాతి స్థానాల్లో షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, రజనీ కాంత్ నిలిచారు. ఇక హీరోయిన్ల జాబితాలో సన్నీ తరువాత కత్రినా కైఫ్, కరీనా కపూర్, కాజల్ అగర్వాల్, దీపికా పదుకునే, ఐశ్వర్యరాయ్, ప్రియాంకచోప్రా నిలిచారు. పాత తరం నటుల విషయానికి వస్తే... అమితాబ్ బచ్చన్ గురించి ఎక్కువమంది సెర్చ్ చేశారు. అనంతరం కమల్ హాసన్, రాజేష్ ఖన్నా నిలిచారు. అదే పాతతరం నటీమణుల్లో రేఖ మొదటి స్థానంలో నిలిచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.