యాప్నగరం

చైతూను చీట్ చేసిన సమంత?

సమంత చైతూను మోసం చేయడం ఏంటి? అనుకుంటున్నారా. నిజమే ఓ విషయంలో ఆమె నాగచైతన్యను మోసం చేసిందట. ఈ విషయాన్ని సమంతే స్వయంగా ట్వీట్ చేసింది.

Samayam Telugu 13 Oct 2016, 2:06 pm
నాగచైతన్య, సమంత... ఇద్దరు సినిమా అభిమానులు కలిస్తే తప్పకుండా చర్చకు వస్తున్న పేర్లివి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వీరి గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది. త్వరలో పెళ్లి చేసుకొని ఒక్కటి కాబోతున్న ఈ జంట కాసేపు షటిల్ ఆడారు. ఈ మ్యాచ్‌లో చైతూపై సమంత గెలిచింది. అయితే ఆమె చీట్ చేసింది గెలిచిందట. ట్వీటర్ ద్వారా ఈ విషయాన్ని సమంత తెలిపింది. ఆమె ఒక ఫొటోను కూడా షేర్ చేసింది. గెలిచిన సమంత షటిల్ కోర్టులో నేల మీద పడుకొని ఉండగా, ఓడిన చైతూను చూస్తే మాత్రం అతడే గెలిచాడనిపిస్తోంది. అతడి ఫీలింగ్ అలా ఉంది. ఆమె ఈ ట్వీట్‌లో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధును కూడా ట్యాగ్ చేసింది. మేం ఇద్దరం బ్యాడ్మింటన్ ఆడటానికి సింధునే స్ఫూర్తి అంటూ ట్వీట్ చేసింది.
Samayam Telugu samantha cheated naga chaitanya in badminton
చైతూను చీట్ చేసిన సమంత?


సమంత ట్వీట్లకు సింధు బదులిస్తూ.. ఏదైతేనేం నువ్వే గెలిచావ్‌గా అంటూ ట్వీట్ చేసింది. సమంతకు కంగ్రాట్స్ చెబుతూ మరో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ట్వీట్ చేసింది. ఎంతైనా ఆడాళ్లు.. ఆడాళ్లే కదూ. చీట్ చేసి గెలిచినా సాటి మహిళగా సమంతకే బాసటగా నిలిచారు. పాపం చైతూను చూస్తుంటే.. ప్రతి ఆడదాని విజయం వెనుక ఓ మగాడుంటాడు అనేలా పాత సామెతను మార్చుకోవాలనిపిస్తోంది కదూ.

Bu ha ha ha ha 🙃🙃 That time when @Pvsindhu1 got us inspired . pic.twitter.com/QNzcRelyQa— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) October 12, 2016
❤️❤️ https://t.co/OWaqbeD555— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) October 13, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.