యాప్నగరం

ముచ్చటగా మూడు అవ్వాల్సిందే-సమంత

సమంత నటనతోనే కాదు తన మాటలతో కూడా గారడీ చేస్తుంది. టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతూ తమిళంకూడా తన హవాని చూపిస్తుంది ఈ భామ. ప్రస్తుతం తమిళ సినిమాలో బిజీ ఉన్న ఈ భామ పొగడ్తలకు వెంటనే పడనంటుంది.

TNN 25 Oct 2016, 4:49 pm
సమంత నటనతోనే కాదు తన మాటలతో కూడా గారడీ చేస్తుంది. టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతూ తమిళంకూడా తన హవాని చూపిస్తుంది ఈ భామ. ప్రస్తుతం తమిళ సినిమాలో బిజీ ఉన్న ఈ భామ పొగడ్తలకు వెంటనే పడనంటుంది. ప్రశంసల విషయంలోనూ తన లెక్కలు తనకు ఉంటాయని ‘నటనతో మేజిక్‌ చేయాలనుకొంటే అది ఒక్కరితోనే సాధ్యం కాదు. చుట్టూ ఉన్న వ్యక్తులూ కీలకమే. అంతా కలిసి స్నేహ పూర్వక వాతావరణంలో పనిచేసినప్పుడు లభించే ఫలితమే వేరుగా ఉంటుంది. అది అనుభవపూర్వకంగా తెలుసుకొన్నా’ అని చెప్పింది.
Samayam Telugu samantha comments on new movie released talk
ముచ్చటగా మూడు అవ్వాల్సిందే-సమంత

సినిమా విడుదలైనప్పుడు ఫలితం కోసం చూడటం నా అలవాటు. అయితే సినిమా చూసిన ప్రేక్షకులు హిట్ అన్నా ఫ్లాప్ అన్నా వెంటనే వారి నిర్ణయంతో ఏకీభవించలేను. చాలాసార్లు తొలిఆట చూసి బాగుందని కొందరు బాలేదని కొందరు అంటుంటారు. వారు చెప్పిన టాక్ తప్పని చాలాసార్లు తేలింది. అందుకే రెండో ఆటా, మూడో ఆట అయ్యాక మాత్రమే సినిమాపై ఒక అంచనాకు వస్తానని నా లెక్కలు నాకున్నాయని చెప్పుకొచ్చింది సమంత.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.