యాప్నగరం

సమంత రిసప్షన్ అక్కడే అట

ఈ మధ్య కాలంలో తన సినిమాల వార్తల కంటే ప్రేమ వ్యవహారంతోనే తరచూ వార్తల్లో నిలుస్తుంది సమంత. అక్కినేని నాగచైతన్యతో త్వరలోనే తన వివాహం జరగబోతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు తెలియలేదు కానీ సమంత తాజాగా తన రిసప్షన్ వెన్యూ మాత్రం ఎక్కడో చెప్పేసింది.

TNN 21 Nov 2016, 10:21 pm

Samayam Telugu samantha naga chaitanya wedding reception venue revealed
సమంత రిసప్షన్ అక్కడే అట

తాజాగా ఈ బ్యూటీ టీ గ్రిల్ రెస్టారంట్ ప్రారంభోత్సవానికి వెళ్లింది. ఈ రెస్టారంట్ మరెవరిదో కాదు సమంత స్నేహితురాలు అయిన డిజైనర్ నీరజ కోన, హీరో నితిన్ కలిసి పెట్టిన జాయింట్ వెంచర్. రెస్టారంట్ ఓపెన్ చేయడానికి వచ్చిన సమంత తనకి తెలంగాణ వంటకాలు అంటే చాలా ఇష్టమని, వంట చేయడం రాకపోయినా చేసిన వంటే రుచి ఎలా ఉందో చెప్పడంలో తనకు సాటి ఎవరు రారని తన మాటలతో ఆకట్టుకుంది. అలానే నా పెళ్లి ఎక్కడ జరుగుతుందో చెప్పలేను కానీ రిసప్షన్ మాత్రం ఖచ్చితంగా ఈ రెస్టారంట్ లోనే పెడతానని చెప్పేసింది. మొత్తానికి తన ఈ బ్యూటీ తన రిసప్షన్ వెన్యూని కన్ఫర్మ్ చేసెసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.