యాప్నగరం

Samantha: సమంత న్యూ ఇయర్‌ మెసేజ్.. రెండు రోజులు ముందే ఎందుకు చేసింది?

న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతుండటంతో స్టార్ సెలబ్రిటీలు తమ ఫ్యామిలీస్ లేదా డేటింగ్ పార్ట్‌నర్స్‌తో కలిసి మాల్దీవ్స్ వంటి వెకేషన్స్ స్పాట్స్‌కు చెక్కేస్తున్నారు. ఇక టాలీవుడ్‌లో ఎన్టీఆర్, మహేష్ వంటి బడా స్టార్లు ఫారిన్‌లోనే తమ కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోనున్నారు. కానీ ఇలాంటి ఈవెంట్స్‌కు ముందుండే స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెషల్ మెసేజ్ పోస్ట్ చేసింది సామ్.

Authored bySanthosh Damera | Samayam Telugu 30 Dec 2022, 7:30 am

ప్రధానాంశాలు:

  • ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత న్యూ ఇయర్ మెసేజ్
  • రెండు రోజుల ముందే చేసిన స్టార్ హీరోయిన్
  • కొత్త సంవత్సరం వేళ సోషల్ మీడియాకు దూరమా?
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Samantha, New Year Message
సమంత
తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్న సమంత (Samantha) కెరీర్ పీక్స్‌లో ఉండగానే అనారోగ్యానికి గురైంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆమె పర్సనల్ లైఫ్ కొంత డిస్టర్బ్ అయినప్పటికీ ఆ తర్వాత కోలుకుని వరుస ప్రాజెక్టులకు సైన్ చేసింది. ఇక సినిమాలతో బిజీగా ఉన్న క్రమంలోనే తాను ‘మయోసైటిస్’(Myositis) అనే అరుదైన కండరాల వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సామ్.. మెల్లిగా కోలుకుంటుండగా ఆమె ఒప్పుకున్న ప్రాజెక్టుల షూటింగ్స్ టెంపరరీగా నిలిచిపోయి.
ఇదిలా ఉంటే, మరో రెండు రోజుల్లో న్యూ ఇయర్ రాబోతోంది. చాలా మంది సెలబ్రిటీలు తమ కొత్త సంవత్సర వేడుకల గురించి ప్లాన్ చేసుకుంటున్నారు. మరికొందరు ఫారిన్, మాల్దీవ్స్ వంటి లొకేషన్స్‌కు ఆల్రెడీ వెళ్లిపోయారు. కాగా ప్రతిసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ (New year celebrations) ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునే సమంత ప్రస్తుతం హెల్తీ ఇష్యూస్ ఎదుర్కొంటున్నందున ఈసారి ఎక్కడ ఉండనుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే సామ్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఒక ఫిలాసఫికల్ మెసేజ్ పోస్టు చేసి ఆశ్చర్యపరిచింది.

ఇన్‌సైడ్ పెయిన్‌ను కంట్రోల్ చేసుకుంటూ బలవంతంగా స్మైల్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నటువంటి ఫొటో షేర్ చేస్తూ.. ‘జీవితంలో ముందుకెళ్లేలా శ్రమించండి.. మనం చేయగలిగిన దానిపై పట్టు సాధించండి!! మనకు మంచిచేసే కొత్త, సులభమైన నిర్ణయాల కోసం ఇదే సమయమని భావించండి. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు.. హ్యాపీ 2023!!’ అంటూ పోస్ట్ చేసింది.

View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)

అయితే సమంత న్యూ ఇయర్‌(జనవరి 1)కు రెండు రోజుల ముందే ముందే పోస్ట్ చేయడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటోందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రత్యేక రోజును ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయిందా? అని భావిస్తున్నారు. అయితే తమ అభిమాన నటి సోషల్ మీడియా వేదికగా మెసేజ్ చేయడంపై పలువురు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

ఇక రీసెంట్‌గా ‘యశోద’ మూవీతో హిట్ కొట్టిన సమంత.. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రమోషన్స్‌కు హాజరైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తను విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటిస్తుండగా.. హెల్త్ ఇష్యూస్ కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. తను కోలుకున్న తర్వాత షూటింగ్ రీస్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇదేగాక డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’ సినిమాలో సమంత లీడ్ రోల్ పోషించింది. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

రచయిత గురించి
Santhosh Damera
సంతోష్ దామెర సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్\u200cటైన్\u200cమెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్\u200cడేట్స్, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, లైఫ్\u200cస్టైల్ స్టోరీస్, సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.