యాప్నగరం

అఖిల్ ఎంగేజ్‌మెంట్‌లో సమంత సందడి!

అఖిల్ అక్కినేని ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌లో సమంత చేసిన సందడి అంతా ఇంతా కాదు...

Samayam Telugu 10 Dec 2016, 7:26 am
నాగచైతన్యకి కాబోయే భార్యగా, నాగ్ కుటుంబంలోనికి రాబోయే పెద్ద కోడలిగా ప్రచారంలో వున్న సమంత నిన్న అఖిల్ అక్కినేని ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. హైదరాబాద్‌లోని జీవీకే హౌజ్‌లో జరిగిన ఈ ప్రైవేటు ఫంక్షన్‌లో సమంత సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
Samayam Telugu samantha ruth prabhu at akhil akkinenis engagement ceremony
అఖిల్ ఎంగేజ్‌మెంట్‌లో సమంత సందడి!


కాబోయే కపుల్ అఖిల్-శ్రియ భూపాల్‌లకి చీర్స్ చెబుతూ సందడి చేసిన సమంత... ఫంక్షన్ అయిపోయాకా, ఆ కుటుంబంతో కలిసి కెమెరాలకి ఇచ్చిన ఫోజులని సైతం ట్విటర్‌లో ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. నాగచైతన్యతో కలిసి నాగ్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా సమంత మెదిలిన తీరు కూడా ఈ ఫంక్షన్‌లో మరో హైలైట్ అయ్యింది.

కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతూ సమంత షేర్ చేసుకున్న ఈ ఫోటోలు కూడా ఎంగేజ్‌మెంట్‌లో సమంతలాగే సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.