యాప్నగరం

పండుగ రోజు కూడా వదలని సామ్.. ఫుల్ బిజీగా సమంత

సమంత ఇప్పుడు సంక్రాంతి సెలెబ్రేషన్స్‌ను పక్కన పెట్టేసినట్టు కనిపిస్తున్నారు. సమంత తన సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. యశోద అనే సినిమాను త్వరితగతిన పూర్తి చేయాలని డిసైడ్ అయినట్టున్నారు.

Samayam Telugu 15 Jan 2022, 6:53 pm

ప్రధానాంశాలు:

  • సంక్రాంతి రోజున కూడా సమంత పని
  • జిమ్‌లో వర్కవుట్లతో బిజీగా సామ్
  • యశోద డబ్బింగ్ చెబుతోన్న సమంత
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu పండుగ రోజు కూడా వదలని సామ్.. ఫుల్ బిజీగా సమంత
samantha Yashoda
పండుగ పూట ఎవ్వరైనా కూడా ఇంటి పట్టునే ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. కానీ సమంత మాత్రం తన పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఉదయాన్నే వర్కవుట్లలో మునిగిపోయారు. వెయిట్ లిఫ్టింగ్ కాంపిటిషన్‌లకు ప్రిపేర్ అవుతున్నట్టుగా వరుసగా వెయిట్‌లను పెంచుకుంటూ లిఫ్ట్ చేసేశార సమంత. 75, 78, 80 కిలోలు అంటూ వెయిట్ లిఫ్ట్ చేసుకుంటూ వెళ్లారు.
అయితే సమంత మాత్రం ఇప్పుడు సంక్రాంతి సెలెబ్రేషన్స్‌ను పక్కన పెట్టేసినట్టు కనిపిస్తున్నారు. సమంత తన సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. యశోద అనే సినిమాను త్వరితగతిన పూర్తి చేయాలని డిసైడ్ అయినట్టున్నారు. శ్రీదేవీ సినిమా బ్యానర్ మీద శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న ఈ మూవీ డబ్బింగ్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్టు కనిపిస్తోంది.

ఇప్పటికే రెండు షెడ్యులను విజయవంతంగా చిత్రయూనిట్ పూర్తి చేసేసింది. తాజాగా సమంత తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ చెప్పుకుంటున్నట్టు కనిపిస్తోంది. వర్క్ వర్క్ వర్క్ అంటూ డబ్బింగ్ చెబుతున్న ఫోటోను సమంత షేర్ చేశారు. పండుగ రోజు కూడా సమంత ఇలా పని చేస్తుండటం చూసి ఆశ్చర్యపోతోన్నారు.

సమంత ఎంతైనా వర్క్ హాలిక్. ఆమె డెడికేషన్ లెవెల్ వేరే అని కామెంట్లు పెడుతున్నారు. సమంత రెండు మూడు రోజుల నుంచి వార్తల్లో మళ్లీ వైరల్ కాసాగింది. విడాకుల అంశం మీద నాగ చైతన్య స్పందించడంతో సమంత టాపిక్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇద్దరి మంచి కోసమే ఆ నిర్ణయం తీసుకున్నామని, తను హ్యాపీ నేను హ్యాపీ అని నాగ చైతన్య అన్న సంగతి అందరికీ తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.