యాప్నగరం

ఎంగేజ్మెంట్ జోష్‌లో చిందేసిన సమంత

ఎప్పటినుండో విరామం లేకుండా ఎగురుతోన్న ప్రేమపక్షులు పెళ్లికి ఒక్క అడుగు దూరానికి వచ్చేశారు, ఇంక ఆ ప్రేమజంటకు ఆనందానికి అవధులు ఏముంటాయి.

TNN 29 Jan 2017, 6:07 pm
ఎప్పటినుండో విరామం లేకుండా ఎగురుతోన్న ప్రేమపక్షులు పెళ్లికి ఒక్క అడుగు దూరానికి వచ్చేశారు, ఇంక ఆ ప్రేమజంటకు ఆనందానికి అవధులు ఏముంటాయి. కలసి చిందేయడం కుదరలేదేమో.. ఆ ముద్దుగుమ్మ మాత్రం సంతోషంతో గంతులేస్తూ.. ఆవీడియోను ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ‘ఆహ.. నా పెళ్లి అంటా.. ఓహో నా పెళ్లి అంటా.. అన్న రేంజ్‌లో వీర కుమ్ముడు కుమ్మేసింది. ఈ ఉపోద్ఘాతం అంతా ఎవరి గురించో అర్థమయ్యే ఉంటుంది కదూ.. టాలీవుడ్‌ హాటెస్ట్ కపుల్స్‌ నాగచైతన్య, సమంత గురించే.
Samayam Telugu samantha ruth prabhu on instagram dance my mood at the moment
ఎంగేజ్మెంట్ జోష్‌లో చిందేసిన సమంత


అసలువిషయానికి వస్తే.. నాగచైతన్య-సమంత ప్రేమించుకోవడం ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనవరి 29న(ఈరోజు) వీరి ఎంగేజ్మెంట్‌ జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం మీడియాకు లీక్ చేయలేదు అక్కినేని ఫ్యామిలీ .
ఇదిలాఉంటే సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది.

సమంత ఈ వీడియోలో విపరీతమైన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఓ రేంజ్‌లో గంతులేస్తోంది. ఈమె ఇంత ఆనందంగా ఉందంటే ఖచ్చితంగా నాగచైతన్యతో ఎంగేజ్మెంట్‌ ఫిక్స్ కావటమే అని అభిమానులు కంగ్రాట్స్ సమంతా అంటూ.. కామెంట్స్ పెడుతున్నారు. ఎంతైనా కోరుకున్నవాడు చేరువౌతున్నాడంటే ఆ కిక్కేవేరబ్బా.. కదా సమంతా!   My mood at the moment 😁💃💃💃💃 A video posted by Samantha Ruth Prabhu (@samantharuthprabhuoffl) on Jan 28, 2017 at 9:04am PST

My mood at the moment 😁💃💃💃💃 https://t.co/0WmUI60GoH — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) January 28, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.