యాప్నగరం

చచ్చిపోతాను అని అనుకున్నా!.. విడాకులపై ఎట్టకేలకు నోరు విప్పిన సమంత

సమంత తాజాగా తన విడాకుల అంశంపై స్పందించింది. నాగ చైతన్యతో విడాకుల తరువాత చనిపోతానని అనుకుందట. బతికే అంత దైర్యముందా? అని అనుమానం వచ్చిందట. కానీ ఇప్పుడు తన లైఫ్‌ను ముందుకు తీసుకెళ్తోందని సమంత చెప్పుకొచ్చింది.

Samayam Telugu 7 Dec 2021, 4:28 pm

ప్రధానాంశాలు:

  • విడాకులపై సమంత కామెంట్లు
  • ధైర్యం ఉందని అనుకోలేదన్న హీరోయిన్
  • చనిపోతానని అనుకున్న సమంత
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu చచ్చిపోతాను అని అనుకున్నా!.. విడాకులపై ఎట్టకేలకు నోరు విప్పిన సమంత
Samantha Divorce
సమంత విడాకుల విషయం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నాగ చైతన్యతో సమంత వేరు పడ్డ తరువాత వచ్చిన వార్తలు, ప్రచారం చేసిన రూమర్లు అందరికీ తెలిసిందే. సమంత మీద నానా రకాల రూమర్లు వచ్చాయి. అక్రమ సంబంధాలను సమంతకు అంటగట్టారు. అబార్షన్ చేసుకుందని ఇలా రకరకాల కామెంట్లు చేశారు. అయితే వాటిపై సమంత మొదటిసారిగా స్పందించింది. నాగ చైతన్యతో విడిపొయిన తరువాత చనిపోతానని అనుకున్నానంటూ సమంత సంచలన కామెంట్స్ చేసింది.
ఇటీవల సమంత ఓ మీడియాతో ముచ్చటించింది. మీరు చేడు రోజులను ఎదుర్కోంటే పర్వలేదు.. వాటి గురించి అర్థం చేసుకోండి.. ఏదైనా పనిని మధ్యలోనే ఆపివేసే పరిస్థితి వస్తే దానిని అంగీకరించండి. సమస్యలతో పోరాడుతునే ఉండండి.. అది ఎప్పటికీ అంతంలేని ఓ యుద్ధం అని సమంత చెప్పుకొచ్చింది.

ఇది తన సమస్య.. అంటే ఏంటీ.. తాను ఇంకా తన జీవితాన్ని గడపాలి.. తనకు తెలుసు తన జీవితాన్ని ఇంకా గడపాల్సి ఉందని అర్థమంటూ సమంత చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం తాను వ్యక్తిగత జీవితంలో ఎదుర్కోంటున్న అన్ని సమస్యలతో పోరాడుతూ..తాను ఎంత బలంగా ఉన్నానని తానే ఆశ్చర్యపోతున్నాను అంటూ సమంత తెలిపింది.

మొదట్లో తాను చాలా బలహీనురాలిని అనుకున్నానంటూ సమంత పేర్కొంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత తాను కృంగిపోయి చనిపోతానని సమంత అనుకుందట.. కానీ ఇంత బలంగా ఉంటాను అనుకోలేదట. ఈరోజు ఇలా ఉన్నానంటే తనకు చాలా గర్వంగా ఉంది.. ఇలా ఎలా ఉన్నానో తెలియడం లేదు అంటూ చెప్పుకొచ్చింది సమంత.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.