యాప్నగరం

Samantha: 'శాకుంతలం' మూవీ విడుదల వాయిదా.. కారణం ఇదే..!

సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'శాకుంతలం' (Shakuntalam). ఎప్పుడో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నవంబర్ 4న రిలీజ్ అవుతుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తుండగా.. మూవీ మేకర్స్ బ్యాడ్ న్యూస్ చెప్పారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 29 Sep 2022, 6:32 pm
సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ సమంత (Samantha) అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఆమె టైటిల్‌ రోల్‌లో నటించిన 'శాకుంతలం' (Shakuntalam) మూవీ విడుదల వాయిదా పడింది. గుణశేఖర్ (Gunasekhar) డైరెక్షన్‌‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవంబర్ 4న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల మూవీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా శాకుంతలం (Shakuntalam Postponed) విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
Samayam Telugu shakuntalam postponed
శాకుంతలం మూవీ రిలీజ్ వాయిదా


'మేము శాకుంతలం సినిమాతో అద్భుతమైన అనుభవాన్ని ప్రేక్షకులను అందివ్వాలని అనుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈ సినిమా 3D వర్షన్‌లో తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఇందుకోసం మరింత సమయం పట్టనుంది. అందుకే ముందుగా ప్రకటించిన తేదీకి సినిమాను విడుదల చేయలేకపోతున్నాం. ప్రపంచం నలుమూలల నుంచి మాపై కురిపించిన మద్దతు, ప్రేమకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సినిమా విడుదల వాయిదా వేస్తున్నందుకు మీ మద్దతు కోసం ఆశిస్తున్నాం. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం..' అంటూ మూవీ మేకర్స్ ప్రకటించారు.


ఇటీవల రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సమంత రాకుమారిగా కనువిందు చేసింది. పౌరాణిక గాథ ఆధారంగా శాకుంతులం మూవీని రూపొందించారు గుణశేఖర్. మహాభారతంలోని ఆదిపర్వంలో దుష్యంతుడి శాకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా స్టోరీని రాసుకున్నారు. దుష్యంతుడి క్యారెక్టర్‌లో మలయాళ హీరో దేవ్ మోహన్ యాక్ట్ చేశారు. తెలుగు, హిందీ, క‌న్నడ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్పణ‌లో డీఆర్‌పీ, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమా గుణ నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీగా వర్క్ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.