యాప్నగరం

రాఖీ కట్టేస్తా.. చైతూకి సమంత హెచ్చరిక!

ప్రియుడికి ఈ హెచ్చరిక ఎందుకు చేసిందంటే..

TNN 9 Sep 2017, 7:48 am
తమ ప్రేమకథను పెద్దలకు చెప్పడానికి తను చాలా ఇబ్బందే పడ్డాను అని చెప్పాడు హీరో నాగచైతన్య. ఈ విషయంలో సమంత డేర్ అని, అయితే తన ఇంట్లో తను చెప్పుకోవడానికే చాలా సమయం పట్టిందని చైతూ వివరించాడు. తాజాగా ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ తమ ప్రేమకథను గురించి వివరించాడు. సమంతతో తన ప్రేమకథ తామిద్దరం కలిసి నటించిన తొలి సినిమా ‘ఏం మాయ చేశావే’ సమయంలోనే మొదలైందని చైతూ చెప్పాడు. ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నాం, ఇష్టపడ్డాం, ప్రేమించుకున్నాం.. అని చైతూ వివరించాడు.
Samayam Telugu samantha threatened to tie me a rakhi reveals naga chaitanya
రాఖీ కట్టేస్తా.. చైతూకి సమంత హెచ్చరిక!


తొలుత ఆ విషయం తమ సన్నిహితులకు తెలిసిందని, వాళ్లు ఆ విషయాన్ని రహస్యంగానే ఉంచేశారని చైతూ చెప్పాడు. తర్వాత సమంత తన ఇంట్లో వాళ్లకు చెప్పిందన్నాడు, ఎటొచ్చీ తన ఇంట్లో చెప్పడానికే చాలా సమయం పట్టిందని వివరించాడు.

ప్రేమ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పేయమని సమంత తనకు అనేక సార్లు చెప్పిందని చైతూ చెప్పాడు. అయినప్పటికీ తను మొహమాటపడుతుంటే.. ఆమె గట్టి హెచ్చరికే చేసిందన్నాడు. ప్రేమ గురించి ఇంట్లో చెప్పేయకుంటే.. రాఖీ తెచ్చి కట్టేస్తా... అని ఆమె హెచ్చరించిందని, ఆ మాట విన్నాకా తను ఆలస్యం చేయకుండా ప్రేమకథను ఇంట్లో వాళ్లకు చెప్పేశానని ఈ అక్కినేని వారబ్బాయి చెప్పాడు.

తన ఇంట్లో వాళ్లు కూడా తమ ప్రేమకు ఎలాంటి అభ్యంతరాలూ చెప్పకపోవడంతో.. తమ ప్రేమకథ సుఖాంతం అవుతోందని చైతూ వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.