యాప్నగరం

చైతుతో సమంత తమిళ సినిమా!

అక్కినేని నాగచైతన్య చాలా కాలంగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. వాస్తవానికి ఇప్పటికే ఆయన కోలీవుడ్....

Samayam Telugu 15 Jun 2017, 8:42 pm
అక్కినేని నాగచైతన్య చాలా కాలంగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. వాస్తవానికి ఇప్పటికే ఆయన కోలీవుడ్ ఎంట్రీ జరిగిపోవాలి. కానీ ప్రస్తుతం ఆ ప్లాన్ నుండి పక్కకు తప్పుకున్నాడు చైతు. తెలుగులో తన మార్కెట్‌ను పెంచుకునే పనిలో పడ్డ చైతు కొన్నాళ్ళ పాటు తమిళ సినిమా గురించి ఆలోచన చేయకూడదని అనుకుంటున్నాడు.
Samayam Telugu samantha to act with naga chaitanya in tamil movie
చైతుతో సమంత తమిళ సినిమా!


అయితే కోలీవుడ్‌లో సినిమా చేయాలనే కోరిక మాత్రం అతడిలో అలాగే ఉంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది కచ్చితంగా తమిళంలో సినిమా చేస్తా అంటున్నాడు చైతు. అయితే దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని చైతు వెల్లడించాడు. ఒకవేళ తను తమిళ సినిమా చేస్తే.. అందులో సమంత హీరోయిన్‌గా నటిస్తుందని చెప్పేశాడు. సమంతకు కోలీవుడ్ మంచి క్రేజ్ ఉంది. అక్కడ సూర్య, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఆమెను హీరోయిన్‌గా పెట్టుకుంటే సినిమాకు మరింత మైలేజ్ వస్తుందనేది చైతు ఆలోచన.

నిజానికి వీరిద్దరికి పెళ్లి అనుకున్న సమయం నుండి తెలుగులో ఒక్క సినిమా ఇద్దరు కలిసి చేయలేదు. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాం అని చెబుతూనే ఉన్నారు. రారండోయ్ సినిమాలో కూడా సమంత నటించాల్సింది కానీ కుదరలేదు. ఇప్పుడు వీరిద్దరు కలిసి కోలీవుడ్‌లో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అక్టోబర్ 6న పెళ్లి జరిగిన అనంతరం కొన్నాళ్ళ పాటు గ్యాప్ తీసుకొని ఒప్పుకున్న కమిట్మెంట్స్ పూర్తి చేయనుంది సమంత. ఆ తరువాత వీరి కాంబోలో సినిమా సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.