యాప్నగరం

సమంతా!!! పెళ్లంటగా.. పాపం చరణ్

టాలీవుడ్‌లో ఇంట్రస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది. అఖిల్ మ్యారేజ్ క్యాన్సిల్‌లో సమంత చైతూ పెళ్లి వీలైనంత తొందరగా చేయలనే ఉంది అక్కినేని ఫ్యామిలీ. కాని రామ్ చరణ్ మాత్రం సమంత పెళ్లితో డీలా పడ్డట్టు తెలుస్తోంది. ఎందుకంటే...

TNN 4 Mar 2017, 12:31 pm
టాలీవుడ్‌లో ఇంట్రస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది. అఖిల్, శ్రేయాల పెళ్లికి బ్రేక్ పడిందనే వార్త బయటకు రావటం దానికి ఇరుకుంటుంబాలు ఖండించకపోవడంతో దాదాపు ఆవార్త నిజమనే అభిప్రాయానికి వచ్చేశారు. వీరి సంగతి అటుంచితే అఖిల్ పెళ్లి క్యాన్సిల్‌తో చైతూ, సమంతల పెళ్లి వీలైనంత త్వరగా చేసే ఆలోచనలో ఉన్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. అయితే సమంత పెళ్లితో రామ్ చరణ్ డీలా పడ్డాడంటూ ఇన్ సైడ్ టాక్. అసలు సమంత పెళ్లి చేసుకుంటుంటే రామ్ చరణ్‌ ఎందుకు ఆలోచనలో పడ్డాడనే విషయానికి వస్తే..
Samayam Telugu samantha to be out from ram charan sukumar film
సమంతా!!! పెళ్లంటగా.. పాపం చరణ్


అపుడెపుడో 2016 డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన ధృవ మూవీ తరువాత రామ్ చరణ్ మరో సినిమా పట్టాలెక్కింది లేదు. సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చాలా రోజులక్రితమే కొబ్బరికాయ కొట్టినా ఆ సినిమా షూటింగ్ పూర్తి స్థాయిలో ఇంకా మొదలుకాలేదు. షూటింగ్ సంగతి అటుంచితే .. ఈ మూవీకి హీరోయిన్‌‌లుగా రాశీఖన్నా, అనుపమా పరమేశ్వరన్‌లను సెలక్ట్ చేశారు. తరువాత ఏమైందో తెలియదు కాని వారిని తప్పించి చివరికి అక్కినేని పెద్ద కోడలు సమంతను ఫైనల్ చేశారు.

అయితే ప్రస్తుతం మే నెలలో సమంత పెళ్లి ఉంటుందని అప్పటికి సినిమా షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ చేయొచ్చనే ప్లాన్‌లో సుకుమార్ ఉండటం. దానికి సమంత కూడా ఓకే చెప్పడంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు రెడీ అయిపోయింది చిత్ర యూనిట్. కాని ప్రస్తుతం రామ్ చరణ్, సుకుమార్ మూవీనుండి సమంత తప్పుకున్నట్లు టాలీవుడ్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. దీనికి కారణం సమంత మే నెల కంటే ముందే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదిలాఉంటే ఇప్పటికే ఇద్దరు హీరోయిన్‌లను చరణ్ సినిమా నుండి తప్పించడం .. ఫైనల్‌గా సమంతను ఓకే చేయడం.. ఆమె కూడా ఈ సినిమా నుండి తప్పుకోవడంతో దసరాకు రిలీజ్ చేద్దామనుకున్న సుకుమార్, చరణ్ మూవీ ఇంకా హీరోయిన్ ఫైనల్ కాకపోవడంతో ఈ సినిమా రిలీజ్‌కు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికి సమంత ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే.. చరణ్ సినిమా అంత లేటు అవుతుందన్నమాట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.