యాప్నగరం

సంజయ్ దత్‌కి కోర్టులో ఉపశమనం

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కి ముంబై అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టులో ఉపశమనం లభించింది. సినీ నిర్మాత షకీల్ నూరానీ...

TNN 17 Apr 2017, 5:50 pm
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కి ముంబై అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టులో ఉపశమనం లభించింది. సినీ నిర్మాత షకీల్ నూరానీ దాఖలు చేసిన ప్రైవేటు పిటిషన్‌ని విచారణకి స్వీకరించిన కోర్టు ఆ కేసు విచారణ కోసం సంజయ్ దత్ కోర్టుకి హాజరు కాలేదన్న నేరం కింద శనివారం అతడికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ చేసింది.
Samayam Telugu sanjay dutt gets relief from mumbai court
సంజయ్ దత్‌కి కోర్టులో ఉపశమనం


అయితే, తనకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అవడంపై కోర్టుని ఆశ్రయించిన సంజయ్ దత్.. తనపై జారీ అయిన అరెస్ట్ వారెంట్‌ని రద్దు చేయాల్సిందిగా కోర్టుకి విజ్ఞప్తి చేశారు. సంజూ విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు అతడిపై గత వారం జారీ అయిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ని రద్దు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ రద్దు కావడం అనేది సంజయ్ దత్‌కి ఓ విధంగా భారీ ఉపశమనం అనుకోవచ్చు. ఆగస్టు 29వ తేదీన జరగనున్న తదుపరి విచారణకి సంజయ్ దత్ హాజరు కావాల్సి వుంటుంది.

2002లో సంజయ్ దత్‌తో 'జన్ కీ బజ్జీ' అనే సినిమాను మొదలుపెట్టాను. కానీ ఆ సినిమాను మధ్యలోనే వదిలేసిన సంజయ్.. తన వద్ద తీసుకున్న మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వలేదు అని పేర్కొంటూ సంజయ్ దత్‌పై నిర్మాత షకీల్ నూరాని కోర్టులో ఓ ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ విచారణకి హాజరు కాని కారణంగానే కోర్టు సంజయ్ దత్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.