యాప్నగరం

​పవన్ ను దేవుడు.. అనుకుంటే, ఇప్పుడిలా అయ్యింది!

దీనిపై స్పందించాలని కోరుతున్నారు. స్పందించేంత వరకూ నిరాహార దీక్షను ఆపేది లేదని అంటున్నారు.

TNN 17 Mar 2017, 10:04 am
హైదారాబాద్ లోని ఫిల్మ్ చాంబర్ వద్ద నిరాహార దీక్షను మొదలుపెట్టారు ‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ సినిమా డిస్ట్రిబ్యూటర్లు. ఆ సినిమాతో తాము తీవ్రంగా నష్టపోయామని.. తమకు న్యాయం చేయాలని కోరుతూ వారు నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఈ విషయంలో సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా హీరో పవన్ కల్యాణ్, ఆ సినిమా నిర్మాత శరత్ మరార్, పవన్ కల్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ లు స్పందించాలని పంపిణీదారులు డిమాండ్ చేస్తున్నారు.
Samayam Telugu sardar destributors huger strike
​పవన్ ను దేవుడు.. అనుకుంటే, ఇప్పుడిలా అయ్యింది!


సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా పంపిణీ హక్కులను తాము భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి కొన్నామని.. అయితే ప్రేక్షకాదరణ పొందని ఆ సినిమా తమను నిండా ముంచేసిందని వారు చెబుతున్నారు. ఇలా నష్టపోయిన తమకు న్యాయం చేస్తామని.. పవన్ కల్యాణ్ , ఆయన సన్నిహితుడు శరత్, మేనేజర్ శ్రీనివాస్ లు హామీ ఇచ్చారని అంటున్నారు. ఆ న్యాయం ఏమిటి? అనగా.. పవన్ కల్యాణ్ తదుపరి సినిమా పంపిణీ హక్కులను తక్కువ ధరకు ఇస్తామని వారు హామీ ఇచ్చారని.. అయితే ఇప్పుడు మాత్రం వాటిని తమకు దక్కకుండా వేరే వాళ్లకు ఇచ్చారని వీరు ఆరోపిస్తున్నారు.

దీనిపై స్పందించాలని కోరుతున్నారు. స్పందించేంత వరకూ నిరాహార దీక్షను ఆపేది లేదని అంటున్నారు. పవన్ కల్యాణ్ ను తాము దేవుడిలా చూశామని.. అదే అభిమానంతో తాము డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను తీసుకున్నామని, తీరా కోట్ల రూపాయలకు మునిగామని వీరు చెబుతున్నారు. తమ పరిస్థితిపై స్పందించాలని అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.