యాప్నగరం

కన్నడ ప్రజలకి క్షమాపణలు చెప్పిన కట్టప్ప

బాహుబలి సినిమాలో కట్టప్పగా కీలక పాత్ర పోషించిన తమిళ సినీనటుడు సత్యరాజ్ కన్నడ ప్రజలకి క్షమాపణలు...

Samayam Telugu 21 Apr 2017, 1:58 pm
బాహుబలి సినిమాలో కట్టప్పగా కీలక పాత్ర పోషించిన తమిళ సినీనటుడు సత్యరాజ్ కన్నడ ప్రజలకి క్షమాపణలు చెప్పారు. కర్ణాటకకి కానీ లేదా కర్ణాటక ప్రజలకి కానీ తాను వ్యతిరేకం కాదు. అందుకు మీకు ఓ ఉదాహరణ చెప్పాలంటే, "గత 30 ఏళ్లుగా నా వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శేఖర్ అనే వ్యక్తి ఓ కన్నడీగుడే అని ఆవేదన వ్యక్తంచేసిన సత్యరాజ్... బాహుబలి సినిమాకి పనిచేసిన చిన్న ఆర్టిస్టుని నేను. నా వల్ల అంత పెద్ద సినిమాకు నష్టం వాటిల్లేలా కర్ణాటక ప్రజలు వ్యవహరించకూడదు'' అని కన్నడీగులకి విజ్ఞప్తి చేశారు.
Samayam Telugu sathyaraj apologises kannada people
కన్నడ ప్రజలకి క్షమాపణలు చెప్పిన కట్టప్ప


'9 ఏళ్ల క్రితం తాను కావేరీ నీటి వివాదంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు కన్నడీగులని బాధపెట్టాయని తెలిసింది. అందుకే అప్పుడు చేసిన వ్యాఖ్యలకిగాను కన్నడీగులకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. అలాగే తమిళ ప్రజలు కూడా పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని తాను విడుదల చేసిన ఓ లేఖలో పేర్కొన్నారు సత్యరాజ్.

'సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు ఏవైనా అవి అతడి వ్యక్తిగతం. అందుకు తమ బాహుబలి-2 సినిమాని అడ్డుకోవద్దు' అని ఆ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నిన్ననే కన్నడీగులకి ఓ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. జక్కన్న కన్నడ భాషలో కర్ణాటక ప్రజలకి విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే సత్యరాజ్ కూడా వారికి స్వయంగా క్షమాపణలు చెప్పడం ప్రాధాన్యతని సంతరించుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.