యాప్నగరం

Satish Vegesna: శ్రీహరి తనయుడు హీరోగా స‌తీశ్ వేగేశ్న‌ కొత్త సినిమా.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్

శ్రీహరి తనయుడు మేఘామ్ష్ శ్రీహరి, వేగేశ్న సతీష్ తనయుడు సమీర్ వేగేశ్న హీరోలుగా డైరెక్టర్ సతీష్ వేగేశ్న కొత్త సినిమా ప్రకటించారు. ఈ రోజు (ఆగస్టు 15) దివంగత డా.శ్రీహరి గారి జయంతి సందర్భంగా ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Samayam Telugu 15 Aug 2020, 3:58 pm
'శతమానం భవతి' చిత్రంతో తన టాలెంట్ చూపించి జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న తాజాగా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాన్ని రూపొందించేందుకు రెడీ అయ్యారు. టాలీవుడ్ గ్రేట్ యాక్టర్ డా. శ్రీహరి తనయుడు మేఘామ్ష్ శ్రీహరి, వేగేశ్న సతీష్ తనయుడు సమీర్ వేగేశ్న ఇద్దరూ ఈ సినిమాలో హీరోలుగా నటించనుండటం విశేషం. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ మూవీని MLV సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మించనున్నారు.
Samayam Telugu శ్రీహరి తనయుడు హీరోగా సతీశ్ వేగేశ్న_ కొత్త సినిమా
Megamsh Srihari Satish Vegesna


నేడు (ఆగస్టు 15) దివంగత డా.శ్రీహరి గారి జయంతి సందర్భంగా ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ "వరుసగా కుటుంబ కథా చిత్రాలు చేసాను. ఇప్పుడు ఓ మంచి పూర్తి స్థాయి వినోదభరితమైన సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. అన్ని పరిస్థితులు చక్కబడిన వెంటనే షూటింగ్ మొదలు పెడతాం" అన్నారు.

Also Read: గెట్ అవుట్ అంటూ రెచ్చిపోయిన అల్లు అర్జున్ తనయుడు.. అబ్బో! ఆ రోషం చూస్తే.. షాకింగ్ వీడియోనిర్మాత MLV సత్యనారాయణ (సత్తిబాబు) మాట్లాడుతూ.. "సతీష్ గారు తీసిన 'శతమానం భవతి' చిత్రం నా మనసుకి బాగా నచ్చింది. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఈ మూవీ టైటిల్, హీరోయిన్స్, ఇతర సాంకేతికనిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం'' అని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.