యాప్నగరం

‘జమున’గా అనుష్క వద్దు.. సమంతే ముద్దు!

సావిత్రి జీవిత కథ ఆధారంగా దర్శకుడు నాగశ్విన్ సినిమా రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఈ మహానటి ప్రాజెక్ట్ కోసం కీర్తి సురేష్, సమంతలను ఎన్నుకున్నారు.

TNN 22 Apr 2017, 3:36 pm
సావిత్రి జీవిత కథ ఆధారంగా దర్శకుడు నాగశ్విన్ సినిమా రూపొందించనున్న సంగతి తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన బయోపిక్ మహానటి సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 10 ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ కోసం కీర్తి సురేష్, సమంతలను ఎన్నుకున్నారు. సావిత్రి టైటిల్ రోల్‌ను కీర్తి పోషిస్తుండగా సమంత ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతోందని టాక్. ఆమె కోణంలోనే సావిత్రి బయోపిక్‌ను ప్రెజంట్ చేయబోతున్నారని సమాచారం.
Samayam Telugu savitri biopic anushka and samantha roles in savitri biopic revealed but
‘జమున’గా అనుష్క వద్దు.. సమంతే ముద్దు!


తాజాగా ఈ సినిమాలో అనుష్కను కూడా ఎంపిక చేసుకున్నారు. ఆమె జమున పాత్రలో కనిపించబోతోందని సమాచారం. అయితే ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుండి ప్రేక్షకులు సమంత, అనుష్కల పాత్రల గురించి చర్చించుకుంటున్నారు.

సమంత జర్నలిస్ట్‌గా, అనుష్క జమున పాత్రలను ఎన్నుకోవడాన్ని తప్పుబడుతున్నారు. జమున పాత్రను సమంతకు, జర్నలిస్ట్ పాత్రను అనుష్కకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఈ సినిమాలో కీలకపాత్ర జెమినీ గణేశన్ క్యారెక్టర్ కోసం ప్రకాష్ రాజ్‌ను ఎన్నుకోవడంపై అన్ని చోట్ల నుండి పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.