యాప్నగరం

అఖిల్ హీరోయిన్‌తో పవన్‌ రొమాన్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి నటించాలని ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లందరూ కోరుకుంటూ ఉంటారు. కానీ ఆ అవకాశం కొందరికే లభిస్తుంది.

TNN 14 Dec 2016, 7:49 pm
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి నటించాలని ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లందరూ కోరుకుంటూ ఉంటారు. కానీ ఆ అవకాశం కొందరికే లభిస్తుంది. తాజాగా తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమా అది కూడా ఫ్లాప్ అయిన సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమ్మాయిని పవన్ హీరోయిన్‌గా ఎంపిక చేశారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
Samayam Telugu sayesha saigal to romance pawankalyan
అఖిల్ హీరోయిన్‌తో పవన్‌ రొమాన్స్


'అఖిల్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన ముంబై భామ సాయేషా సైగల్. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో నిర్మాతలు ఆమెపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ తన నటనతో, నాజూకు తనంతో యూత్‌ను బాగానే ఆకట్టుకుంది.

రీసెంట్ గా 'శివాయ్' అనే బాలీవుడ్ సినిమాలో మెరిసింది. ఇప్పుడు మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతుందని టాక్. అది కూడా పవర్ స్టార్‌తో అవకాశం రావడంతో ఈ భామ ఫుల్ హ్యాపీ‌లో ఉందట.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'కాటమరాయుడు' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్, దర్శకుడు నేసన్ సినిమాల్లో నటించనున్నాడు. వచ్చే ఏడాది నుండి ఈ రెండు చిత్రాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేశారు. ఇప్పుడు నేసన్ సినిమాలో హీరోయిన్‌గా సాయేషా‌ను ఎన్నుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే తెలుగులో చాలా మంది హీరోయిన్స్ వరుస సినిమాలతో దూసుకుపోతూ మిగతా భాషల్లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఆఫర్స్‌ని అందిపుచ్చుకుంటున్నారు. అలాంటి హీరోయిన్స్‌ని కాదని ఫ్లాప్‌లలో ఉన్న హీరోయిన్‌కి చాన్స్ ఇవ్వడం పవన్ ప్రయోగం చేస్తున్నారంటూ టాలీవుడ్‌లో చర్చలుమొదలయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.