యాప్నగరం

'ఫిదా' తర్వాత మరో లవ్ స్టోరీకి శేఖర్ కమ్ముల ప్లాన్

ఫిదా సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల తాజాగా మరో లవ్ స్టోరీకి ప్లాన్ చేస్తున్నారు.

TNN 14 Aug 2017, 3:32 pm
ఫిదా సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల తాజాగా మరో లవ్ స్టోరీకి ప్లాన్ చేస్తున్నారు. మరో సినిమాకు స్టోరీ రాయడం ఇంకా మొదలుపెట్టలేదు. కాకపోతే అది కూడా యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గానే వుంటుంది అని అన్నారు శేఖర్ కమ్ముల. అంతేకాకుండా ఇకపై తన చిత్రాల్లో తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల నేపథ్యాన్ని కథాంశంలో ఓ భాగం అయ్యేలా చూసుకుంటానని స్పష్టంచేశారు ఫిదా డైరెక్టర్.
Samayam Telugu sekhar kammula planning another love story after fidaa
'ఫిదా' తర్వాత మరో లవ్ స్టోరీకి శేఖర్ కమ్ముల ప్లాన్


సహజమైన భాషలో, సహజమైన పద్ధతిలో ఎమోషన్స్‌ని వ్యక్తపర్చడమే తనకి ఇష్టం అని చెప్పిన డైరెక్టర్.. తన పంథాని ఇకపై అలాగే కొనసాగిస్తానని తెలిపారు. ఫిదా మూవీ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో శేఖర్ కమ్ముల తమ కోసం కూడా ఓ స్టోరీ రెడీ చేస్తే బాగుంటుంది అని ఆశించే యంగ్ యాక్టర్స్ చాలామందే వున్నారు. శేఖర్ తర్వాతి లవ్ స్టోరీలో లీడ్ రోల్ పోషించే అదృష్టం ఎవరికి దక్కుతుందో చూడాలిమరి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.