యాప్నగరం

అమ్మాయిలు దానికే పనికొస్తారు: చలపతిరావు

ఇండస్ట్రీలో తండ్రిగా, బాబాయ్‌గా, మావయ్యగా ఇలా రకరకాల పాత్రలు పోషించి చిన్న పెద్దా అని తేడా లేకుండా అందరితో బాబాయ్ అని పిలిపించుకుంటున్న చలపతిరావు ఎంత పెద్ద మనిషో అందరికీ తెలిసిందే.

TNN 22 May 2017, 2:09 pm
ఇండస్ట్రీలో తండ్రిగా, బాబాయ్‌గా, మావయ్యగా ఇలా రకరకాల పాత్రలు పోషించి చిన్న పెద్దా అని తేడా లేకుండా అందరితో బాబాయ్ అని పిలిపించుకుంటున్న చలపతిరావు ఎంత పెద్ద మనిషో అందరికీ తెలిసిందే. మరి ఆ పెద్దరికాన్ని ఆయన నిలబెట్టుకుంటున్నారా..? అంటే లేదనే చెప్పాలి. ఇటీవల చాలా ఆడియో వేడుకల్లో చలపతిరావు బూతులు మాట్లాడుతూ భయపెడుతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే నిన్న జరిగిన ‘రా రండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో ఫంక్షన్‌లో కూడా చోటు చేసుకుంది.
Samayam Telugu senior actor chalapathi rao vulgar comment on women
అమ్మాయిలు దానికే పనికొస్తారు: చలపతిరావు


సినిమా ట్రైలర్‌లో ఉన్న డైలాగ్ గురించి యాంకర్ 'అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా' అని చలపతి బాబాయ్‌ని అడిగింది. దానికి ఆయన 'అమ్మాయిలు హానికరం కాదు గానీ.. పక్కలోకి పనికొస్తారు' అనేశాడు. ఆయన చెప్పిన సమాధానానికి అక్కడున్న వాళ్లంతా షాకయ్యారు. మైక్ ఇచ్చి ప్రశ్న అడిగిన యాంకర్‌కు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు.

చలపతిరావు దృష్టిలో అమ్మాయిలంటే దానికే పనికొస్తారా..? మరీ ఇంత నీచంగా ఎలా మాట్లాడగలిగారు..? అని అందరూ అనుకుంటున్నారు. ప్రేక్షకులు చూస్తున్నారనే ఇంగితం కూడా లేకుండా లైవ్ ప్రోగ్రాం‌లో అలా మాట్లాడడం ఆయన హోదాకు తగదని పరిశ్రమలోని కొంతమంది మహిళలు అంటున్నారట. వాళ్లింట్లో కూడా అమ్మాయిలు ఉంటారు కదా.. వారితో కూడా ఇలా మాట్లాడతారా..? ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని మర్యాదగా ప్రవర్తిస్తే మంచిదని చాలా మంది సలహా ఇస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.