యాప్నగరం

MAA ఎన్నికలపై సీనియర్ నటుడు సుమన్ రియాక్షన్.. అలాంటోళ్లకు ఆ పదవి కరెక్ట్ కాదంటూ ఓపెన్ కామెంట్స్

గత నెల రోజులుగా జనాల్లో హాట్ టాపిక్ అయిన MAA Elections గురించి సీనియర్ యాక్టర్ సుమన్ ఓపెన్ అయ్యారు. తాను ఈ పోటీలో ఎందుకు నిలవలేదనే విషయమై క్లారిటీ ఇస్తూ 'మా' అధ్యక్ష పదవిపై కామెంట్స్ చేశారు.

Samayam Telugu 13 Sep 2021, 7:47 am
అక్టోబర్ 10న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో MAA పదవుల కోసం పోటీపడుతున్న తారల హడావిడి ఎక్కువైంది. అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఎవరికి వారు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నారు. దీంతో ఎప్పటిలాగే 'మా' ఎలక్షన్స్ టాపిక్ జనాల్లో చర్చనీయాంశం అయింది. ఆరంభంలో ప్రకాష్ రాజ్‌కు మద్ధతు ఇచ్చిన బండ్ల గణేష్.. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లోకి జీవితా రాజశేఖర్ ఎంట్రీ ఇవ్వ‌డంతో బ‌య‌ట‌కు వచ్చి స్వతంత్య్ర అభ్యర్థిగా కార్యదర్శి పదవి కోసం పోటీలో నిలిచారు. ఇలాంటి పరిస్థితుల నడుమ 'మా' ఎలక్షన్ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది.
Samayam Telugu మా ఎన్నికలపై సీనియర్ నటుడు సుమన్ రియాక్షన్
Suman


ఈ నేపథ్యంలో తాజాగా 'మా' ఎలక్షన్స్, అధ్యక్ష పదవి విషయమై మీడియాతో మాట్లాడారు సీనియర్ నటుడు సుమన్. మా అధ్యక్ష పదవి అనేది చాలా ముఖ్యమైన పోస్ట్ అని ఆయన చెప్పారు. అందరి కష్టసుఖాలు చూసుకుంటూ ఎప్పుడూ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. బిజీగా ఉన్న ఆర్టిస్టులకు ఆ పోస్ట్ కరెక్ట్ కాదనేది తన భావన అని సుమన్ అన్నారు.
Nabha Natesh: ఆమెతో పోలుస్తారేమోనని భయపడ్డా.. మహేష్‌ బాబుతో సినిమాపై ఇస్మార్ట్ బ్యూటీ క్లియర్ హింట్
తాను సినిమాల పరంగా బిజీగా ఉన్నాను కాబట్టే 'మా 'ఎన్నికల్లో పోటి చేయడం లేదని ఆయన చెప్పారు. అందుబాటులో ఉండలేకపోవడం, పోస్ట్‌కు సరైన న్యాయం చేయలేనన్న ఉద్దేశంతోనే దూరంగా ఉన్నానంటూ ఓపెన్ అయ్యారు. తనకు రెండు పడవల మీద కాలు పెట్టడం ఇష్టం లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇకపోతే డ్రగ్స్ ఇష్యూ అనేది ఒక్క సినీ ఫీల్డ్ లోనే కాదు అన్ని చోట్ల ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు సుమన్. కాకపోతే సెలబ్రిటీలు, సినీ గ్లామర్‌పై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళే ఎక్కువ పబ్లిసిటీ అవుతారని తెలిపారు. ఇతర దేశాల్లాగా మన దేశంలో కూడా కఠినమైన శిక్షలు అమలు చేస్తేనే ఈ అసాంఘిక కార్యక్రమాలను అరికట్టగలమని సుమన్ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.