యాప్నగరం

ఖుష్బూ.. ‘పియా తూ అబ్‌ తొ ఆజా’ ఊపేస్తోందిగా!

ఇటీవల ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో కీలకపాత్రలో మెరిసిన అలనాటి నటి ఖుష్బూ.. ఓ పార్టీలో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

TNN 12 Feb 2018, 4:06 pm
ఇటీవల ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో కీలకపాత్రలో మెరిసిన అలనాటి నటి ఖుష్బూ.. ఓ పార్టీలో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో ఖుష్బూ ‘పియా తూ అబ్‌ తొ ఆజా’ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేస్తుండటం.. ఆ పక్కనే ఉన్న మరో సీనియర్ నటి సుకన్య కూడా జత కలసి వీరలెవల్లో స్టెప్పులు వేయడంతో సీనియర్ బొద్దుగుమ్మ చిందేసిన వీడియో తమళ తంబీలకు తెగనచ్చేస్తుంది. ఇటీవల చెన్నైలోని సవేరా హోటల్‌లో సతురంగ వెట్టై-2 మూవీ ఈవెంట్‌లో ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్.
Samayam Telugu senior actresses kushboo and sukanya dance video goes viral
ఖుష్బూ.. ‘పియా తూ అబ్‌ తొ ఆజా’ ఊపేస్తోందిగా!


ఈ ఫంక్షన్‌ డిన్నర్ సమయంలో ‘పియా తూ అబ్‌ తొ ఆజా’ సాంగ్‌ను ప్లే చేశారు. దీంతో అక్కడే సుకన్యతో కలిసి డిన్నర్ చేస్తున్న ఖుష్బూ సాంగ్‌కి తగ్గట్టుగా అద్భుతమైన స్టెప్పులు వేస్తూ పార్టీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వయసు పెరిగినా ఖుష్బూ వేసిన స్టెప్పుల్లో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదంటూ ఈ వీడియోను తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. ఇక సుకన్య కూడా ఖుష్బూ స్టెప్పులకు ఏమాత్రం తీసిపోకుండా డ్యాన్స్‌తో అదుర్స్ అనిపించింది. అయితే మద్యం మత్తులో ఖుష్బూ, సుకన్యలు చిందేశారంటూ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.