యాప్నగరం

ఇదేంటిది మీనా గర్భవతా? ఆ వీడియో చూసి అవాక్కవుతున్న జనం!!

సీనియర్ హీరోయిన్ మీనా గర్భం దాల్చిందా? అనే అనుమానం కలిగేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.

Authored bySunil Boddula | Samayam Telugu 25 Apr 2022, 9:14 am
బాలనటిగా కెమెరా ముందుకొచ్చి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది మీనా. ఒకానొక సమయంలో అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడుతూ కెరీర్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. క్యూట్ నెస్‌కి మారుపేరుగా తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని కొద్దికాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరోయిన్ రీసెంట్‌గా ''దృశ్యం2, పెద్దన్న'' సినిమాలతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది.
Samayam Telugu ఇదేంటిది మీనా గర్భవతా?
Meena


స్టార్ స్టేటస్ అనుభవిస్తూ కెరీర్‌ కాస్త స్లో అయిన వెంటనే ప్రముఖ వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది మీనా. ప్రస్తుతం ఈ దంపతులకు ఓ పాప. ఆమె పేరు నైనికా విద్యాసాగర్. అయితే సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్ రోల్ పోషించని ఈ సీనియర్ హీరోయిన్.. ఈ మధ్యకాలంలో మాత్రం కాస్త హవా నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫొటో షూట్స్, డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ నెటిజెన్ల చూపు తనవైపుకు తిప్పుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో క్లిప్ చూసి ఒక్కసారిగా షాకయ్యారు నెటిజన్లు. ఇందుకు కారణం అందులో మీనా గర్భవతిగా కనిపించడమే. అయితే అది రియల్ కాదు.. ఓ షూటింగ్ నిమిత్తం అని తెలిసి కూల్ అయ్యారు.
Acharya: హాట్ టాపిక్‌గా మారిన కాజల్ రోల్.. ఆ మాటతో ఇరుకున పెట్టిన రామ్ చరణ్!
మొదట కూతురు పుట్టిన తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన మీనా.. తిరిగి ఇటీవలే రీ- ఎంట్రీ ఇస్తూ కెమెరా ముందుకొచ్చింది. సెకండ్‌ ఇన్నింగ్స్ స్టార్ట్‌ చేసి హీరోయిన్‌గా అవకాశాలు పట్టేస్తూనే సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా ఓకే చెబుతోంది. మరోవైపు బుల్లితెర ప్రోగ్రామ్స్ పరంగా కూడా మీనా బిజీ అవుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా షేర్ చేసిన వీడియోలో గర్భవతిగా కనిపించిన మీనా.. ''చాలా మార్పులొచ్చాయి. అప్పట్లో ఈ గెటప్‌ వేయడం చాలా సులభంగా ఉండేది. దీన్ని కవర్‌ చేసేందుకు హెవీ చీరలు కట్టుకునేదాన్ని. కానీ ప్రస్తుతం ఈ గెటప్‌కు, ఈ రోల్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. షిఫాన్‌ చీరలు కట్టుకున్నా చూడటానికి చాలా నాచురల్‌గా ఉంది'' అని క్యాప్షన్‌ రాసింది. అంటే తన అప్‌కమింగ్ సినిమాలో గర్భవతిగా కనిపించబోతున్నట్లు చెప్పిందన్నమాట మీనా.
View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.