యాప్నగరం

సినీ గేయ రచయిత అదృష్ట దీపక్‌ కన్నుమూత

సినీ ఇండస్ట్రీ నుంచి మరో విషాద వార్త వినాల్సి వచ్చింది. సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి అదృష్ట దీపక్‌ కరోనాతో కన్నుమూశారు.

Samayam Telugu 16 May 2021, 10:51 am
కరోనా కల్లోల పరిస్థితుల్లో వరుసపెట్టి వినిపిస్తున్న మరణవార్తలు తీవ్ర విషాదంలోకి నెట్టేస్తున్నాయి. సినీ ఇండస్ట్రీ నుంచి అయితే ఒకరి మరణం తాలూకు విషయం నుంచి పూర్తిగా తేరుకోకముందే మరొకరి మరణవార్త బయటకు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అభ్యుదయ కవి అదృష్ట దీపక్‌ కన్నుమూశారు. కరోనాతో పోరాడుతూ కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు.
Samayam Telugu సినీ గేయ రచయిత అదృష్ట దీపక్‌ కన్నుమూత
Adrushta Deepak

ఇలియానా సైడ్ బిజినెస్.. ప్రియుడితో బ్రేకప్ తర్వాత గోవా బ్యూటీ ఇలా! జనాల్లో కొత్త డౌట్స్
సినీ గేయ రచయితగా, నటుడిగా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు అదృష్ట దీపక్‌. నేటి భారతం చిత్రంలో ఆయన రచించిన ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’ గీతానికి ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డు పొందారు. ఆయన రచనలకు గాను ఎన్నో పురస్కారాలు లభించాయి. అదృష్ట దీపక్‌ మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.