యాప్నగరం

Jr Ntr : చిరంజీవితో ఎన్టీఆర్ విభేదాలు.. కారణమదేనంటూ గుట్టు విప్పిన సీనియర్ నిర్మాత !

Megastar Chiru - Tarak - Ntr : టాలీవుడ్‌లో ఒక‌ప్పుడు సినిమాలు చేసి నిర్మాత‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న ఆవుల గిరి.. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి, జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ధ్య ఉండే అభిప్రాయ బేదాల గురించి విష‌యాల‌ను తెలియ‌జేశారు.

Samayam Telugu 8 Jan 2022, 8:29 pm

ప్రధానాంశాలు:

  • చిరు- తారక్ మధ్య విభేదాలు గురించి చెప్పిన నిర్మాత
  • అప్పుట్లో ఎన్టీఆర్ అలా కారణమెవరు?
  • అసలు గుట్టు విప్పిన నిర్మాత
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu చిరంజీవి - ఎన్టీఆర్
Chiranjeevi - Ntr
టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవి, నేటి త‌రంలో అగ్ర క‌థానాయ‌కుడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. ఎవ‌రి ఫ్యాన్ బేస్ వారికుంది. ఎన్టీఆర్ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి నాళ్ల‌లో, మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ మ‌ధ్య తెలియ‌ని ఓ గ్యాప్ ఉండింది. ఒకానొక సంద‌ర్భంలో లైవ్‌లో మాట్లాడుతూ చిరంజీవి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు, ఆయ‌నెవ‌రో త‌న‌కు తెలియ‌దంటూ చెప్ప‌డం.. అప్ప‌ట్లో హాట్ టాపిక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.
కొన్నాళ్లు పాటు మెగాస్టార్ చిరంజీవికి, నంద‌మూరి న‌ట వార‌సుడైన యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్‌కు మ‌ధ్య గ్యాప్ ఉంటూ వ‌చ్చింద‌ని వార్త‌లు కూడా వినించాయి. త‌ర్వాత ప‌రిస్థితులు క్ర‌మంగా మారాయి. చిరంజీవి మ‌న‌స్త‌త్వం తెలుసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు వారి ఫ్యామిలీతో చ‌క్క‌గా క‌లిసిపోయారు. ముఖ్యంగా మెగా న‌ట వార‌సుడైన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో చ‌క్క‌టి స్నేహ బంధం ఏర్ప‌డింది.

అయితే కెరీర్ ప్రారంభంలో చిరంజీవి అంటే తార‌క్‌కి ఎందుకు ప‌డ‌లేదు? అనే ప్ర‌శ్న‌కు స‌రైన స‌మాధానం ఎవ‌రూ చెప్పేవారు. కాదు.. బాక్సాఫీస్ వ‌సూళ్లు, ఇమేజ్ వ‌ల్ల వ‌చ్చిన ఇగో క్లాషెష్ అని మాత్రం చెప్పేవారు. అది ఓ ర‌కంగా నిజ‌మే! అయినా ఓ స్టార్ గురించి, అందులోనూ అప్ప‌ట్లో నెంబ‌ర్ వ‌న్ హీరో గురించి అప్పుడప్పుడే ఎంట్రీ ఇచ్చిన తార‌క్ త‌న‌కు తెలియ‌ద‌న‌డం .. చాలా మంది మెగా ఫ్యాన్స్‌కు ఇబ్బంది క‌లిగించిన విష‌య‌మే.

అయితే అదంతా గ‌తం ఇప్పుడు రెండు ఫ్యామిలీల మ‌ధ్య స‌త్సంబంధాలు నెల‌కొన్నాయి. అయితే అస‌లు మెగా - నంద‌మూరి పాత గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మేంటి? అనే దానిపై సీనియ‌ర్ నిర్మాత డిస్ట్రిబ్యూట‌ర్ అయిన అవుల గిరి ఓ ఇంట‌ర్వ్యూలో వివ‌ర‌ణ ఇచ్చారు. ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్‌లో ఓ మేనేజ‌ర్ ఉండేవాడ‌ట‌. ఆ మేనేజ‌ర్ చిరంజీవి గురించి ఎన్టీఆర్ లేనిపోనివి చెప్పేవాడ‌ట‌. చిరంజీవిని ఎన్టీఆర్ ద‌గ్గ‌ర చెడు చిత్రీక‌రించేవాడ‌ట‌. దాంతో ఎన్టీఆర్‌కు తెలియ‌కుండానే చిరుపై తెలియ‌ని కోపం క్రియేట్ అయిపోయిదంట‌. కానీ.. కొన్ని రోజుల‌కు స‌ద‌రు మేనేజ‌ర్ గురించి అసలు నిజం తెలియ‌డంతో ఎన్టీఆర్ ఆయ‌న్ని మేనేజ‌ర్‌గా తొలగించార‌ని, త‌ర్వాత చిరు ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో ఎన్టీఆర్‌కు స‌ఖ్య‌త పెరిగింద‌ని గిరి చెప్పుకొచ్చారు. అద‌న్న‌మాట అస‌లు సంగ‌తి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.