యాప్నగరం

బాహుబలి2: షారుఖ్‌పై క్లారిటీ ఇదిగో

బాహుబలి2లో షారుఖ్ నటిస్తున్నాడంటూ వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్.

TNN 14 Feb 2017, 8:25 pm
బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా సన్సేషన్ క్రియేట్ చేయండంతో దానికి కొనసాగింపుగా వస్తోన్న బాహుబలి2 మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఆ సినిమాకి సంబంధించిన ఏ వార్త బయటకు వచ్చినా అది వైరల్ అయిపోతోంది. గత రెండు రోజులుగా బాహుబలి2 లో షారుఖ్ ఖాన్ నటిస్తున్నాడంటూ నేషనల్ మీడియా సైతం కోడై కూసింది. దీనికి కారణంలేకపోలేదు, గతంలో రయీస్ సినిమా ప్రమోషన్‌లో బహుబలి సినిమాని ఈ హీరో పొగిడేయడంతో ఈ వార్తకు బలం చేకూరింది.
Samayam Telugu shah rukh khan not part of baahubali the conclusion
బాహుబలి2: షారుఖ్‌పై క్లారిటీ ఇదిగో


అయితే తాజాగా బాహుబలి టీం ఈ వార్తపై క్లారిటీ ఇచ్చి ప్రచారానికి ఫుల్ స్టాఫ్ పెట్టేసింది. షారుఖ్ ఖానే.. మా సినిమాలోనే.. అబ్బే అలాంటిదేం లేదు అవన్నీ రూమర్స్ మాత్రమే అంటూ.. అయినా అంతపెద్ద హీరో మా సినిమాలో నటిస్తే అంతకంటే అదృష్టమా అని క్లారిటీ ఇచ్చింది.

గతంలో కూడా బాహుబలి2లో తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటిస్తున్నారని వార్తలు రాగా.. ఆతరువాత సూర్య నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. అవన్నీ రూమర్స్ అని తేలాయి. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న రాజమౌళి ఏప్రియల్ 28 బాహుబలి2ను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.