యాప్నగరం

కూతురి బికినీ ఫోటోలపై స్పందించిన షారుఖ్ ఖాన్

పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించే బాలీవుడ్ నటుల్లో షారుఖ్ ఖాన్ కూడా ఒకరు. ప్రత్యేకించి కూతురు...

TNN 2 Jul 2016, 4:57 pm
పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించే బాలీవుడ్ నటుల్లో షారుఖ్ ఖాన్ కూడా ఒకరు. ప్రత్యేకించి కూతురు సుహానా విషయంలో షారుఖ్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తాడనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఇటీవలి కాలంలో తన కూతురు సుహానాకి సంబంధించిన బికినీ ఫోటోలతో కూడిన వార్తలు మీడియాలో రావడం షారుఖ్‌ని ఇబ్బందికి గురిచేసింది. బాలీవుడ్ టు రీజినల్ మీడియా వరకు అన్ని వెబ్‌సైట్స్‌లో సుహానా బికినీ ఫోటోలు ప్రత్యక్షమవడంపై షారుఖ్ ఒకింత ఆగ్రహం వ్యక్తంచేశాడు.
Samayam Telugu shah rukh khans reaction to suhanas viral bikini pics
కూతురి బికినీ ఫోటోలపై స్పందించిన షారుఖ్ ఖాన్


"సుహానా తన తమ్ముడు అబ్రామ్‌తో బీచ్‌లో ఆడుకుంటున్నప్పటి ఫోటోలవి. కొన్ని వెబ్‌సైట్లు ఈ ఫోటోలపై అనవసరంగా అత్యుత్సాహం ప్రదర్శించాయి. ఆయా మీడియా సంస్థలకి నేను చెప్పేది ఒక్కటే. మీరు పబ్లిష్ చేసిన సుహానా బికినీ ఫోటోలని తొలగించండి! ఎందుకంటే ఇప్పుడామె వయస్సు జస్ట్ 16 ఏళ్లు మాత్రమే. తన కూతురిపై అటువంటి వార్తలు చూడాల్సి రావడం ఇబ్బందికరంగా వుంది" అని షారుఖ్ అభిప్రాయపడ్డాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.