యాప్నగరం

అర్జున్ రెడ్డి దర్శకుడి రెండో సినిమా అదే!

గత సంవత్సరం ఆగస్టులో విడుదల అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో వివరించనక్కర్లేదు.

Samayam Telugu 25 Apr 2018, 11:25 am
గత సంవత్సరం ఆగస్టులో విడుదల అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో వివరించనక్కర్లేదు. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనిపించుకుంది. ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద బంపర్ కలెక్షన్స్‌ను రాబట్టింది ఈ సినిమా. కేవలం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే గాక, ఇతర చిత్రపరిశ్రమల వారిని కూడా ఆకర్షించింది. దీన్ని రీమేక్ చేయడానికి ఇతర భాషల హీరోలు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు.
Samayam Telugu sandeep


ఇప్పటికే తమిళంలో ఈ సినిమాను ‘వర్మ’ పేరుతో రీమేక్ చేస్తుండగా, ఇప్పుడు ఈ సినిమా హిందీ వెర్షన్ కూడా పట్టాలెక్కే సమయం వచ్చినట్టుగా తెలుస్తోంది. హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ విషయంలో పలువురు హీరోల పేర్లు వినిపించాయి. చివరగా షాహిద్ కపూర్ తో ఈ సినిమా పట్టాలెక్కుతోందని తెలుస్తోంది.

షాహిద్ ఓకే చెప్పేశాడని, ఇక హీరోయిన్ ఎంపిక, లొకేషన్ల హంటింగ్ మొదలు కానున్నదని తెలుస్తోంది. విశేషం ఏమిటంటే అర్జున్ రెడ్డి బాలీవుడ్ వెర్షన్‌కు ఒరిజినల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వం వహించబోతుండటం. తొలి సినిమాతోనే సంచలనం నమోదు చేసిన ఈ దర్శకుడు తన రెండో సినిమాగా కూడా అర్జున్ రెడ్డినే చేపట్టబోతున్నాడు. రీమేక్ వెర్షన్‌కు తనే దర్శకత్వం వహించబోతున్నాడు. తమిళ రీమేక్ వెర్షన్‌ను జాతీయ అవార్డెడ్ దర్శకుడు బాల చేపట్టిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.